ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

ABN, Publish Date - Jun 17 , 2024 | 08:00 PM

జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.

రాజమహేంద్రవరం: జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ(Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. రుషికొండ భవనాలతో పెత్తందారీ ఎవరో ప్రజలకు అర్థమైందన్నారు. వైసీపీ హయాంలో ప్రజాదనం భారీగా దుర్వినియోగం అయ్యిందని మండిపడ్డారు.


ఐదేళ్ల పాలనలో జగన్ కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని, కానీ రూ.500కోట్లతో భారీ భవనాలు నిర్మించుకున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇస్తుందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి గురుతర బాధ్యత తనకు అప్పగించారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 17 , 2024 | 08:00 PM

Advertising
Advertising