Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది
ABN, Publish Date - Sep 30 , 2024 | 11:47 AM
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంక్‌ల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు.
రాజమండ్రి: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజులు చాలా బాధపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కోడలు రాజమండ్రిలో ఉన్నప్పుడు ప్రజలు తమకు దైర్యంగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
ALSO READ: Pawan Kalyan : రేపు తిరుమలకు పవన్ కల్యాణ్
ఇవాళ(సోమవారం) రాజమండ్రిలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంక్‌ల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు. 1938 మంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని వివరించారు.
5 కోట్ల స్కాలర్ షిప్‌లు ఇచ్చామని అన్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్‌ల ద్వారా లక్ష మందికి, మెబైల్ క్లినిక్ ద్వారా 70 వేల మందికి ఉచిత వైద్యం అందించామని అన్నారు. కుప్పంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు. ఏపీ, తెలంగాణల్లో 20 లక్షల మందికి విపత్తు సాయం అందించామని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో లక్ష లీటర్ల పాలు, తాగు నీరు సరఫరా చేశామని భువనేశ్వరి వెల్లడించారు.
మానవత్వంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు సేవలు అందిస్తుంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మానవత్వంతో ప్రజలకు సేవలు అందిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం అందిస్తున్నారని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుచేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం..
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ
High Tension.. పులివెందుల నియోజక వర్గంలో దారుణం..
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 30 , 2024 | 12:01 PM