Pithani Satyanarayana: ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం మాది
ABN, Publish Date - Jun 16 , 2024 | 04:14 PM
తమది ప్రజా ప్రభుత్వమని.. దుర్మార్గపు ప్రభుత్వం కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) వ్యాఖ్యానించారు. దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
పశ్చిమ గోదావరి: తమది ప్రజా ప్రభుత్వమని.. దుర్మార్గపు ప్రభుత్వం కాదని తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) వ్యాఖ్యానించారు. దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం తమదని చెప్పారు. ఆచంటలో ఈరోజు(ఆదివారం) మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆచంట నియోజకవర్గంలోని పాఠశాలల్లో కిట్ల పంపిణీ సక్రమంగా జరగాలని ఆదేశించారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఆత్మ స్థైర్యాన్ని ప్రజా ప్రతినిధులు కోల్పోయారని చెప్పుకొచ్చారు. ఉన్నతమైన విద్యను అందించటానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉద్ఘాటించారు. రెండు రోజుల్లో ప్రతీ గ్రామంలో విద్యార్థులకు పుస్తకాలు అందాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు.ప్రతీ విద్యార్థి తమ తల్లితండ్రులకు గౌరవం తీసుకురావాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..
YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..
Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jun 16 , 2024 | 04:22 PM