ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election Results: గోదావరి జిల్లాల సెంటిమెంట్ వర్కౌట్..

ABN, Publish Date - Jun 04 , 2024 | 07:16 PM

ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Pawan, Chandrababu, Purandeswari

ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వైసీపీ 15, పశ్చిమగోదావరి జిల్లాలో 15 సీట్లు ఉండగా వైసీపీ 13 చోట్ల విజయం సాధించింది. ఉభయగోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉండగా.. 28 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది.

AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్


ఏయే పార్టీ ఎన్ని సీట్లు..

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 22 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 11 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో గెలుపొందింది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ పోటీచేసిన ఒకచోట విజయం సాధించింది.


కలిసొచ్చిన పొత్తు..

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్ చేయడానికి జనసేనతో పొత్తు ప్రధాన కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జనసేన రాష్ట్రంలో మొత్తం 21 స్థానాల్లో పోటీచేయగా ఉభయ గోదావరి జిల్లాల్లో 11 స్థానాల్లో పోటీచేసింది. దీంతో ఈ జిల్లాల్లో జనసేన బలంగా ఉందనేది స్పష్టమవుతోంది. ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. జనసేనతో పొత్తు కారణంగా కాపుల ఓట్లు టీడీపీ బదిలీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కారణంగా యువత కూటమి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.


పవన్ పోటీతో ఏకపక్షం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీచేయడం ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి గెలుపుపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వైసీపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తు పెట్టుకోవడంతో మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగినట్లు తెలుస్తోంది.


Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 07:16 PM

Advertising
Advertising