Eelection Commission: మచిలీపట్నంలో ఏకంగా ఆరుగురు వాలంటీర్లపై వేటు
ABN, Publish Date - Mar 21 , 2024 | 09:57 AM
Andhrapradesh: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కన పెట్టేసిన వాలంటీర్లు.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై వేటు వేస్తోంది.
కృష్ణా, మార్చి 21: ఎన్నికల కోడ్‌ను (Election Code) ఉల్లంఘిస్తున్న వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ (Election Commission) చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కన పెట్టేసిన వాలంటీర్లు.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల (YSRCP MLA Candidates) ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై వేటు వేస్తోంది. మచిలీపట్నంలో (Machilipatnam) ఆరుగురు వాలంటీర్లపై వేటు పడగా... కడప జిల్లాలో ఏకంగా 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Nara Family: దేవాన్ష్ పుట్టిన రోజు.. శ్రీవారి ఆశీస్సులు పొందిన నారా కుటుంబం
ఈసీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా...
మచిలీపట్నం బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో ఆరుగురు వాలంటీర్లు పాల్గొన్నారు. విషయం తెలిసిన ఎంపీడీఓ.. వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంత మంది వాలంటీర్లు ఎన్నికల నిబంధనలు పట్టనట్లుగా వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. బుధవారం గిలకలదిండిలో ఎమ్మెల్యే పేర్నినాని నిర్వహించిన ప్రచారంలో లంకే ఏడుకొండలు అనే వాలంటీర్ పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్
కడపలోనూ ఇదే పరిస్థితి...
అటు కడప జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు, వాలంటీర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకేరోజు ఏకంగా 11 మంది వాలంటీర్లను అధికారులు విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, వాలింటీర్లపై కేసులు నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
AP Elections: పదే పదే కోడ్ ఉల్లంఘన.. వైసీపీ అభ్యర్థులపై ఈసీ కన్నెర్ర
AP Elections 2024: ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కష్టమేగా జగన్!!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 21 , 2024 | 10:27 AM