AP Election 2024: ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక పంపిన ఏపీ డీజీపీ
ABN, Publish Date - May 22 , 2024 | 06:50 PM
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమరావతి: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (Election Commission of India) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై (AP DGP Harish Kumar Gupta) కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు. సీఈఓ ఎంకే మీనా ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ పేర్కొన్నారు.
పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పాలన విభాగం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు నియమించినట్లు చెప్పారు. లూక్ అవుట్ సర్క్యూలర్ కూడా జారీ చేశామని డీజీపీ తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోసం తెలంగాణలో రైడ్స్ చేస్తున్నామని.. దొరక్కగానే అరెస్టు చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజీలాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేసిన కేసులో ఏ వన్‌గా చేర్చేమని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
కాగా.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వేటా కొనసాగుతునే ఉంది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 22 , 2024 | 06:59 PM