YS Sharmila: పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఆయన చెప్పిందే చేస్తారు
ABN, Publish Date - Apr 16 , 2024 | 03:35 PM
Andhrapradesh: ‘‘పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కన్ను సన్నులో ఎమ్మెల్యే పని చేస్తాడు.. పెద్దిరెడ్డి ఏం చెప్తే..దాని ఎమ్మెల్యే అమలు చేస్తాడు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తిరుపతి, ఏప్రిల్ 16: ‘‘పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కన్ను సన్నులో ఎమ్మెల్యే పని చేస్తాడు.. పెద్దిరెడ్డి ఏం చెప్తే..దాని ఎమ్మెల్యే అమలు చేస్తాడు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy Ramachandra Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి భారీగా అవినీతికీ పాల్పడారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా బాబు, జగన్‌లు (CM Jagan) రాష్ట్ర ప్రజలను మోసం చేశారని.. రాష్ట్ర హక్కుల కోసం ఎవరు పోరాడలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని చెప్పుకొచ్చార. హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని.. హోదా 15 ఏళ్లు కావాలని పట్టుబట్టిన బాబు.. హోదా అంటే జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!
ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు రాదో అని చెప్పిన జగన్.. అధికారంలోకీ వచ్చాక ఒక్కరి చేత కూడా రాజీనామా చెయ్యించలేదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని.. మన చేతిలో చిప్ప పెట్టారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. వైఎస్ఆర్ హయాంలో రైతే రాజు అని.. రుణమాఫీ దగ్గర నుంచి మద్దతు ధర వరకు వైఎస్ఆర్ ఇచ్చారని గుర్తుచేశారు. వ్యవసాయానికి సబ్సిడీ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారన్నారు. జగన్ పాలనలో కనీసం పంట నష్టం జరిగితే పరిహారం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రిప్‌పై కూడా సబ్సిడీ లేదని.. ఇన్పుట్ సబ్సిడీని బంద్ చేసారన్నారు. జగన్ పాలనలో అప్పు లేని రైతు లేడని ఏపీసీసీ చీఫ్ అన్నారు.
YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష
వైఎస్ఆర్ హయాంలో రేషన్ షాపుల్లో 11 రకాల వస్తువులు ఇచ్చేవారని.. ఇప్పుడు బియ్యం తప్పా అన్ని బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో అన్ని వస్తువుల ధరలు పెంచారని దుయ్యబట్టారు. ఒక చేత్తో ఇచ్చి.. ఇంకో చేత్తో గుంజుకుంటున్నారన్నారు. మట్టి చెంబు ఇచ్చి.. వెండి చెంబు గుంజుకుంటున్నారని విరుచుకుపడ్డారు. జగన్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలు ఎక్కడ అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని చెప్పి.. సర్కారే మద్యం అమ్ముతుందని.. ఇదేనా మద్య నిషేధం అంటూ నిలదీశారు. రాష్ట్రం అంతా మాఫీయా మయం అయ్యిందన్నారు. హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు పెట్రేగిపోతున్నాయన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి బీజేపీకి బానిసగా మారారని ఆరోపించారు. టీడీపి, వైసీపీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని.. కాంగ్రెస్‌తోనే 10 ఏళ్లు హోదా అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Election 2024: జగన్ సర్కారు అలా చేయొద్దు.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు
AP Elections: ప్రజలు ఎటు వైపు?
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 16 , 2024 | 03:53 PM