ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: మా ప్రచారంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆరణి శ్రీనివాసులు

ABN, Publish Date - Apr 29 , 2024 | 04:54 PM

తాము ప్రచారం చేసే సమయంలో వైసీపీ (YSRCP) నేతలు తమకు అడ్డుతగిలి అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) అన్నారు. తమ ప్రచారం సందర్భంగా గిరిపురంలో తమపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోక పోవటం, వైసీపీ వారం రోజులుగా తమ ప్రచారంలో అరాచకాలు సృష్టించటంపై తిరుపతి ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.

తిరుపతి: తాము ప్రచారం చేసే సమయంలో వైసీపీ (YSRCP) నేతలు తమకు అడ్డుతగిలి అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) అన్నారు. తమ ప్రచారం సందర్భంగా గిరిపురంలో తమపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోక పోవటం, వైసీపీ వారం రోజులుగా తమ ప్రచారంలో అరాచకాలు సృష్టించటంపై తిరుపతి ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... తమపై జరిగిన దాడుల గురించి ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.


AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..

అయితే వారు ఏం చర్యలు తీసుకోలేదని.. అందుకే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వైసీపీకి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ పోస్టులో ఉండి భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని.. చిత్తూరు నుంచి గూండాలు వచ్చి తమపై దాడి చేశారని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు. కడప నుంచి గుండాలను తెప్పించే సంస్కృతిని తిరుపతికి తెచ్చింది వై.ఎస్. రాజారెడ్డి, కరుణాకర్ రెడ్డిలేనని విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలుగా తిరుపతిలో కరుణాకర్‌రెడ్డి తన అనుచరులతో గంజాయి అమ్మించి వేల కోట్ల రూపాయలు సంపాదించారని ధ్వజమెత్తారు.


అది నిజం కాదంటే ఏ వ్యాపారం చేసి అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా వేల కోట్లు సంపాదించారో కరుణాకర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమాలు చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. తమ జోలికి వస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రచార రథానికి అనుమతి ఉన్నా, పోలీసులు ప్రచార రథాన్ని ఎందుకు సీజ్ చేశారని నిలదీశారు. కరుణాకర్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకునే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఏ పోలీసు అధికారులు తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారో వారిపైన రాబోయే రోజుల్లో చర్యలు తప్పవని ఆరణి శ్రీనివాసులు హెచ్చరించారు.


CM Jagan: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 05:00 PM

Advertising
Advertising