ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections2024: బ్లూ మీడియాలో ఆ కథనాలు చూస్తుంటే దిగజారిపోయారేమో..:అశోక్ బాబు

ABN, Publish Date - Jun 01 , 2024 | 09:16 PM

బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు (Ashok Babu) ఆరోపించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Ashok Babu

అమరావతి: బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు (Ashok Babu) ఆరోపించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాత్రిని పగలు... పగలుని రాత్రి అని రాయడం ఎంత అబద్దమో అలానే రాస్తున్నారని ఎద్దేవా చేశారు. చీఫ్ ఏజెంట్ల మీటింగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు రాకుండానే వచ్చినట్లు తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటన్నారు.


శనివారం టీడీపీ కార్యాలయంలో అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అవసరమైతే తిరగబడమని చెప్పడం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అహంకార పూరిత చర్యలకు నిదర్శమని మండిపడ్డారు. సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం వైసీపీ నేతలకు షాక్‌ను ఇచ్చిందన్నారు. అది జిర్ణించుకోలేక సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.


దమ్ముంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై సజ్జల ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. చేతిలో పేపరు ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతో తప్పుడు రాతలు రాసి క్యాడర్‌ను కాపాడుకోవాలని చూస్తున్నారని అన్నారు.ప్రెస్ కౌన్సిల్‌కు సాక్షిమీద ఫిర్యాదు చేశామని అన్నారు. తప్పడు రాతలకు, వైసీపీ నేతల తప్పుడు పనులకు త్వరలోనే గుణపాఠం తప్పదని అశోక్ బాబు హెచ్చరించారు.

Updated Date - Jun 01 , 2024 | 10:30 PM

Advertising
Advertising