AP Election 2024: పులివర్తి నానిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన అచ్చెన్న
ABN, Publish Date - May 14 , 2024 | 10:30 PM
ఓటమి భయంతో పిచ్చి పట్టి వైసీపీ నాయకులు దాడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ దాడిని అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి అతని గ్యాంగ్ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: ఓటమి భయంతో పిచ్చి పట్టి వైసీపీ నాయకులు దాడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ దాడిని అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి అతని గ్యాంగ్ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ లండన్ వెళ్లిపోతే తామెక్కడికి వెళ్లాలనే భయం వైసీపీ నాయకుల్లో ఉందని చెప్పారు.
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
ఐదేళ్ల వైసీపీ హింసా రాజకీయాలకు నిన్ననే ప్రజలు స్వస్తి పలికారని అన్నారు. బ్యాలెట్ బాక్సులు తెరిస్తే రాష్ట్రం విడిచి వైసీపీ నాయకులు పరార్ అవ్వడం ఖాయమని హెచ్చరించారు. పగిలిన తలలకు, చిందిన రక్తానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవడానికి వైసీపీ నేతలు “సిధ్ధం” కావాలని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Putta Mahesh: ఓటింగ్ అంతా కూటమికి అనుకూలం
కాగా.. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై (Pulivarthi Nani) వైసీపీ నేతలు ఈరోజు(మంగళవారం) హత్యాయత్నానికి పాల్పడ్డారు. నానితో పాటు ఆయన సతీమణి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూము వద్ద ఈవీఎంలను తారుమారు చేసే యత్నం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పులివర్తి నాని అక్కడకు వచ్చారు.
ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు భారీగా ఉండటం చూసిన నాని వారిని ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో వారు ఒక్కసారిగా నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ కూటమి నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పులివర్తి నాని కారు ధ్వంసం, గన్‌మెన్ ధరణికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతకులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు.
Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..
Read Latest AP News And Telugu News
Updated Date - May 14 , 2024 | 10:31 PM