ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP Manifesto 2024: భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ సాక్షిగా..!

ABN, Publish Date - Apr 28 , 2024 | 04:32 AM

అడ్డగోలు అబద్ధాలు, లేనిపోని గొప్పలు, అసత్యాలతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారు.ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే లక్ష్యంగా రూపకల్పన చేశారు. ఐదేళ్ల క్రితం వైసీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక హామీలను విస్మరించారు.

  • భగవద్గీత, బైబిల్‌,ఖురాన్‌ సాక్షిగా..

  • అడ్డగోలు అబద్ధాలు, కోతలతో వైసీపీ మేనిఫెస్టో.. గత ఎన్నికల్లో చెప్పిన కీలక అంశాలు మాయం

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): అడ్డగోలు అబద్ధాలు, లేనిపోని గొప్పలు, అసత్యాలతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను (YSRCP Manifesto) తయారు చేశారు.ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే లక్ష్యంగా రూపకల్పన చేశారు. ఐదేళ్ల క్రితం వైసీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ (YS Jagan Mohan Reddy).. ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక హామీలను విస్మరించారు. అయినా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో 99శాతం హామీలు నెరవేర్చామంటూ 2024 మేనిఫెస్టోలో పేర్కొన్నారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అమరావతి రాజధానిని నాశనం చేసిన జగన్‌.. మళ్లీ మూడు రాజధానుల రాగాన్ని అందుకున్నారు. విశాఖ నుంచే పాలనంటూ ప్రకటించారు.

  • కర్నూలును న్యాయ రాజధానిని చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జాబ్‌ కేలండర్‌పై మాట తప్పిన జగన్‌ ఈసారి ఏకంగా యూపీఎస్సీ తరహాలో ఏటా గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టూ ప్రకటిస్తానని మోసకారి హామీ ఇచ్చారు. సంపూర్ణ మద్యనిషేధం, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ముచ్చటే లేదు. పింఛన్లను రూ.3,500కు పెంచుతామని ప్రకటించారు.

  • 2028 జనవరిలో 250, 2029 జనవరిలో మరో రూ.250 అంటూ ప్రకటించారు. అమ్మఒడి రూ.17000 ఇస్తామని, ఇందులో రూ.15,000 తల్లుల ఖాతాలో జమ అవుతాయని, 2వేలు పాఠశాల అభివృద్ధికి వెచ్చిస్తామని వెల్లడించారు. మహిళలకు 3లక్షల దాకా వడ్డీలేని రుణాలిస్తామన్నారు.

  • ఆటోలు, ట్యాక్సీల కొనుగోళ్లపై వడ్డీ రాయితీ రూ.50,000 దాకా ఉంటుందని వెల్లడించారు. లారీ, టిప్పర్‌ డ్రైవర్లకూ వాహనమిత్ర కింద రూ.50,000, ఆటో, టాక్సీ డ్రైవర్లకు 10లక్షల దాకా బీమా అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు పథకాన్ని జగన్‌ ప్రకటించారు. తాను ఇచ్చిన ఎన్నికల హామీల విలువ ఏటా రూ.29,100 కోట్లు మాత్రమేనని..

  • టీడీపీ కూటమి తరఫున ఇచ్చిన ఎన్నికల హామీల విలువ రూ.లక్షన్నర కోట్లు ఉందని జగన్‌ వెల్లడించారు. కూటమి ఇచ్చిన హామీలలో 19.33 శాతం మాత్రమే తాను ఇచ్చానని జగన్‌ చెప్పకనే చెప్పారు.

  • వైసీపీ మేనిఫెస్టో చూసి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెదవివిరిచారు. ఏ విధంగా చూసినా కూటమి హామీల వల్లే ప్రజలకు ఎక్కువగా లబ్ధి కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ హామీలు ఏమయ్యాయి?

ప్రత్యేక హోదా ఏదీ?

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమంటూ 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఊరూ వాడా చెప్పారు. కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. తాజాగా 2024 వైసీపీ మేనిఫెస్టోలో హోదా కోసం కృషి కొనసాగిస్తారట.

కడప స్టీల్‌, రైల్వే జోన్‌ హుష్‌కాకి!

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం అంశాన్ని జగన్‌ పూర్తిగా పక్కనపెట్టారు. గత ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక కూడా కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించడం ఖాయమని ప్రజలను మభ్య పెట్టారు. తాజా మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనే లేదు. అలాగే విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని కూడా విస్మరించారు.

జాబ్‌ కేలండర్‌ మాటే లేదు

ఏటా జనవరి 1న జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్‌... ఒక్కసారి కూడా చెప్పిన మాట ప్రకారం విడుదల చేయలేదు. ఒకే ఒక్కసారి జూన్‌లో జాబ్‌ కేలండర్‌ విడుదల చేసినా అందులో 60 శాతానికి పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఈసారి మేనిఫెస్టోలో జాబ్‌ కేలండర్‌ అనే మాటనే చేర్చలేదు.

ఓట్లు అడగనన్నారే..!

  • ‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం’.. 2019 మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చిన హామీ ఇది.

  • ‘సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా’ అని అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ ఆయన ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మించారు.

  • సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన నగదులో దాదాపు సగం మద్యం ఆదాయం ద్వారానే వచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టించి మరీ ‘జే’ బ్రాండ్లను అమ్మించారు. కమీషన్ల రూపంలో మద్యం కంపెనీల నుంచి వేల కోట్లు అనధికారికంగా దోచుకున్నారు. తాజా మేనిఫెస్టోలో మద్యం అన్న మాటే లేదు.

పోలవరం ఇంకెన్నాళ్లు?

చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు పనులను పరుగులు పెట్టించగా, జగన్‌ సర్కారు వచ్చాక నాశనం చేసింది. పలుమార్లు డెడ్‌లైన్లు మార్చడం మినహా ప్రాజెక్టును కట్టలేకపోయింది. రాజ్యసభకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2019 నాటికి ప్రాజెక్టు ప్రగతి 67.09 శాతం ఉంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ డ్యాష్‌బోర్డు సమాచారం ప్రకారం అది 71.02 శాతంగా ఉంది. అంటే 58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం 5శాతం ప్రగతినే సాధించింది. 56,495 నిర్వాసిత కుటుంబాలకుగానూ 12,797 కుటుంబాలకు మాత్రమే పునరావాసాన్ని కల్పించారు. తాజా మేనిఫెస్టోలో ఐదేళ్లలో పోలవరం పూర్తిచేస్తామని పేర్కొంది. జగన్‌ ఐదేళ్లలో పాలనలో జరిగిన పురోగతిని పరిశీలిస్తే ఈ హామీ కూడా మోసమేనని తెలుస్తుంది.

పేదల ఇళ్లపై కాకి లెక్కలు

‘ఇళ్లులేని పేదలందరికీ ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలిస్తాం’ అని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చింది. కానీ ఈ ఐదేళ్లలో జగన్‌ సర్కారు కట్టిన ఇళ్లు 5లక్షలు మాత్రమే. అంటే ఇంకా 20 లక్షల మంది నిరుపేదల సొంతింటి కల నెరవేర్చలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి లబ్ధిదారులను మోసం చేసేందుకు జగన్‌ సిద్ధపడ్డారు. ‘‘గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నాం. 22.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇప్పటికి 9.2 లక్షలకు పైగా పూర్తిచేశాం’’ అని మేనిఫెస్టోలో అబద్ధాలు వల్లె వేశారు. ఏకంగా 32.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఐదేళ్లలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

మత్స్యకార భరోసాలో మాయలు

మత్స్యకార భరోసాను 2019లో ప్రారంభించినప్పుడు ఏటా లక్షా 35వేల మందికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 2020లో 1,09,231మందికి, 2021లో 1,19,875 మందికి, 2022లో 1,08,755మందికి, 2023లో 1,23,519 మందికి లబ్ధి చేకూర్చినట్లు గతంలో చెప్పారు. కానీ 2024 ఎన్నికల మేనిఫోస్టోలో మాత్రం ఏకంగా 2.43లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. 2024 మేనిఫెస్టోలో ప్రస్తుతం ఏటా ఇస్తున్న రూ.10వేలు మరో ఐదేళ్ల పాటు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. వేటకు వినియోగించే బోట్లకు ఇచ్చే సబ్సిడీ డీజిల్‌ను దళారులు పక్కదారి పట్టించారు. కేంద్రం వాటాతో చేపట్టిన 4పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లను తామే నిర్మిస్తున్నట్లు గొప్పలుచెప్పుకున్నారు.

కౌలు రైతుల చట్టం తెచ్చిందెవరు?

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులను గుర్తించేందుకు చట్టబద్ధమైన ప్రక్రియ తీసుకొచ్చామని వైసీపీ తన మేనిఫెస్టోలో గొప్పగా చెప్పుకుంది. కౌలు రైతుల చట్టం 2011లో ఉమ్మడి రాష్ట్రంలోనే అమల్లోకి వచ్చింది. అప్పుడు ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ లైసెన్డ్స్‌ కల్టివేటర్స్‌ యాక్ట్‌-2011. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పాలనలో ఈ చట్టం పేరు మార్చి ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారుల చట్టం-2017ను తీసుకొచ్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక దానికి చట్టసవరణ చేశారు. అంతేతప్ప, ఆయనే దేశంలో తొలిసారిగా కౌలురైతుల చట్టం తీసుకురాలేదు.

నేతన్న నేస్తంతో సరి

చేనేత కార్మికులందరికీ పెన్షన్‌ ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీ ఇచ్చిన జగన్‌.. అమల్లోకి వచ్చే సమయానికి లబ్ధిదారులను ఆరు దశల్లో వడపోశారు. రకరకాల కొర్రీలు పెట్టి నేతన్న నేస్తం ఒక్కటే అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.50లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 81వేల మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. గతేడాది ఆ సంఖ్యను భారీగా తగ్గించిన వైసీపీ సర్కారు 69వేల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. పట్టుచీరల తయారీ కార్మికులకు టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ.2వేలు కొనసాగిస్తానంటూ మాటిచ్చిన జగన్‌ అధికారంలోకి రాగానే తూచ్‌ అనేశారు. చేనేత మహిళలకు 45ఏళ్లకే పెన్షన్‌ అంటూ అందులోనూ కోత విధించారు. వడ్డీ లేని రుణం విషయంలోనూ మడమ తిప్పేశారు.

వాహనమిత్ర కొందరికే !

వాహన డ్రైవర్లను అన్ని విధాలా అదుకుంటానని ప్రతిపక్షంలో ఉండగా ఆటో డ్రైవర్లకు జగన్‌ మాటిచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. లారీ, ట్రక్కు, ట్రాక్టర్‌ డ్రైవర్లను మినహాయించి ఆటో, క్యాబ్‌, మాక్సీ డ్రైవర్లకే వరకే అని నిబంధనపెట్టారు. మొత్తం 7లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 2.36లక్షల మందికి మొదటి ఏడాది ఇచ్చారు. నాలుగేళ్లపాటు ఆ సంఖ్యను అటూఇటూ చేసి పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో విధిస్తున్న జరిమానాలు, ఆయిల్‌ రేట్లు దేశంలో ఎక్కడా లేవని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల గతి అధోగతే!

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రహదారులు, మౌలిక వనరుల రంగానికి చోటే దక్కలేదు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం రహదారుల అభివృద్ధి, విస్తరణ, కొత్త ప్రాజెక్టుల గురించి కనీసం మాట వరసకు చెప్పుకునేంతగా ఏమీ చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.6,500 కోట్ల ఎన్‌డీబీ ప్రాజెక్టును కూడా చేపట్టలేక చతికిలపడింది. అందుకే మేనిఫెస్టోలో మౌలిక వనరుల రంగం కిందకు వచ్చే రోడ్ల గురించి మాటైనా లేదు. మళ్లీ గెలిస్తే రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారో భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పనేలేదు. అంటే, ఒకవేళ జగన్‌ సర్కారు వస్తే రోడ్లు మరింత అధోగతి పాలుకావాల్సిందే.

ఉద్యోగులు.. ఉసూరు

  • వైసీపీ మేనిఫెస్టో రాష్ట్రంలోని 16లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉసూరుమనిపించింది. గత ఐదేళ్లలో ఉద్యోగులకు చెల్లించాల్సి రూ.20వేల కోట్ల పైగా ఉన్న బకాయిల ఊసే లేదు. పీఆర్సీ సంగతీ అంతే.

  • ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామన్న మాట కూడా లేదు. సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ పునరుద్ధరిస్తామంటూ గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని జగన్‌ విస్మరించారు. 2024 మేనిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ ఊసేలేదు.

  • తన ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు కట్‌ చేసి ఇప్పుడు మళ్లీ అధికారంలోకి తెస్తే వాటిని పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చేశారు. గత మేనిఫెస్టోలో అన్ని ప్రభుత్వశాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

  • రాష్ట్రంలో 30 వేలమంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, 4 వేలమంది వరకు రెగ్యులరైజ్‌ చేసి 10వేల మందికి మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా వెయ్యి అదనంగా వేతనాలు పెంచుతామంటూ గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచారు. వారికి సంక్షేమ పథకాలు రద్దు చేశారు.

  • ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టించి ఇస్తామని గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు కాలేదు. అయితే.. వచ్చే ఐదేళ్లలో ఇల్లు లేని ఉద్యోగులకు సొంత జిల్లాలోనే స్థలాలు ఇస్తామని, 60ు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని 2024 మేనిఫెస్టోలో చేర్చారు.

విశాఖపై ఉత్తుత్తి ప్రేమ

  • వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ ప్రకటించారు. గత మేనిఫెస్టోలో రాజధాని అంశం పెట్టలేదు. జగన్‌ సీఎం అయిన 6నెలల తర్వాత విశాఖ పరిపాలన రాజధానంటూ అసెంబ్లీలో ప్రకటించారు.

  • అప్పటినుంచి దసరాకి వెళ్తామని, దీపావళికి వెళ్తామని, వైజాగ్‌లో కాపురం ఉంటామని చెప్పడమే తప్ప ఆచరణలో సాధ్యపడలేదు. అయితే ఈ ఐదేళ్లలో జగన్‌ అనుచరవర్గం విశాఖను అడ్డంగా దోచుకున్నారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయి కబ్జాలకు పాల్పడ్డారు.

  • రుషికొండపై ఉన్న భవనాలు కూల్చేసి సీఎం నివాసం కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌ నిర్మించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని జగన్‌పై సొంత చెల్లి షర్మిలతో సహా ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం కూడా అమరావతే రాజధాని అన్న విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో కనీసం ఉత్తరాంధ్రలోనైనా ఓట్లకు గేలం వేయడం కోసం మేనిఫెస్టోలో రాజధాని అంశాన్ని జగన్‌ ప్రస్తావించారు.

పారిశ్రామికం.. తిరోగమనం

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలుగా ఇస్తున్న రాయితీలకు తోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో తిరోగమనం మొదలైంది. జగన్‌ కక్షపూరిత వైఖరి, కమీషన్లు, వాటాల కోసం అధికార పార్టీ నాయకుల వేధింపులతో ఉన్న పరిశ్రమలు పారిపోవడమే తప్ప.. ఈ ఐదేళ్లలో కొత్తగా చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటీ రాలేదు. వైసీపీ పాలనలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎ్‌సఎంఈ)ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో పరిశ్రమలు నడపలేక... బ్యాంకులకు అప్పుల వాయిదాలు కట్టలేక ఎంఎ్‌సఎంఈల నిర్వాహకులు నలిగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇంకా వందల సంఖ్యలో యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొనడంతో జగన్‌ సర్కారు 2021లో రూ.1,110 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించింది. తొలివిడతగా రూ.440 కోట్లు విడుదల చేసింది. ఏటా ఆగస్టులో ప్రోత్సాహకాలు అందజేస్తామని సంక్షేమ కేలెండరులో ప్రకటించడమే తప్ప తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఈ మూడేళ్లలో ఎంఎ్‌సఎంఈలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు రూ.4వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. ‘2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాం. ఐదేళ్లలో రూ. 85,543 కోట్ల పెట్టుబడులు.. 28.89లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎ్‌సఎంఈలకు రూ.2,087కోట్ల ప్రోత్సాహాలు అందించాం’ అంటూ 2024 మేనిఫెస్టోలో పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని పారిశ్రామికవేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

చేయూత, ఆసరాలో మాయ

  • వైఎ్‌సఆర్‌ చేయూత పథకంపై జగన్‌ మాయాజాలం చేశారు. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75వేలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ గెలిస్తే వచ్చే ఐదేళ్లలో కూడా నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పున మరో రూ.75వేలు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి అని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఇచ్చింది, ఇకపై ఇవ్వబోయేది అంతా కలిపి మొత్తం పదేళ్ల కాలానికి పెద్ద మొత్తంలో చూపించి అంకెల గారడీ చేశారు. ఇక ‘ఆసరా’లోనూ మేనిఫెస్టోలో మహిళలకు టోకరా వేశారు.

  • 2019 ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ.25,571కోట్లు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దఫాల్లో ఇప్పటికే చెల్లించామని తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాంటి లబ్ధిని వచ్చే ఐదేళ్లలో మహిళలకు కల్పిస్తామని మాత్రం చెప్పలేదు. అయితే ఆసరా, జీరో వడ్డీ రుణాలు అంటూ అర్భాటం చేశారు. గతంలో చేసినవి మాత్రం చెప్పి గెలిస్తే వచ్చే ఐదేళ్లలోఏమిస్తామన్న అంశాన్ని గాలికొదిలేశారు.

  • డ్వాక్రా రుణాలకు గత చంద్రబాబు ప్రభుత్వంలో రూ.5 లక్షల వరకు జీరో వడ్డీ అమలు చేసేవారు. జగన్‌ వచ్చిన తర్వాత ఆ పరిమితి రూ.3 లక్షలకు కుదించారు.

  • దాని పరిమితిని పెంచుతారేమోనని ఆశించిన మహిళలకు నిరాశ ఎదురైంది. వచ్చే ఐదేళ్లు దీన్ని ఇలాగే కొనసాగిస్తామని తేల్చేశారు. కాగా, మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని, వార్డ్‌ మెంబర్‌ నుంచి మేయర్ల వరకు చట్టం చేసి మరీ అన్నింటా 50 శాతం పదవులు అక్కచెల్లెమ్మలకేనని మేనిఫెస్టోలో గతంలో చేసినవి చెప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా మహిళలకు రాజకీయంగా ఏం చేస్తారన్న విషయంపై స్పష్టంగా హామీలు ఇవ్వలేదు.

  • ఈబీసీ నేస్తం విషయంలో కూడా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ ప్రకటించలేదు. గతంలో ఇచ్చిన వాటిని మళ్లీ చెప్పుకోవడమే తప్ప ఈబీసీ మహిళలకు కొత్త హామీలు ఇవ్వలేదు. ఈబీసీ నేస్తం కొందరికి రెండేళ్లు మాత్రమే లభిస్తే, మరికొందరికి ఒక ఏడాది మాత్రమే అందాయి. నాలుగు విడతలు లబ్ధి పొందిన లబ్ధిదారులు చాలా తక్కువ మందే ఉన్నారు.

కాపు సంక్షేమం.. అంకెల గారడీ

  • కాపు సంక్షేమానికి ఏడాదికి రూ.2వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని 2019 మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. కానీ ఆ మేరకు కాపు కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదు. దానిని కప్పిపుచ్చుకొనేందుకు కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.

  • 45-60ఏళ్ల వయసున్న పేద కాపు మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేలు చొప్పు న ఐదేళ్లలో రూ.75వేలు ఇస్తామని జగన్‌ పదేపదే చెప్పారు.

  • తీరా ఐదేళ్లలో నాలుగుసార్లు రూ.60వేలే ఇచ్చారు. 3.3 లక్షల మంది కాపు మహిళలకు ఏడాదికి రూ.500కోట్ల మేర రూ.2వేల కోట్లు ఇచ్చారు. ఇవికాకుండా మరొక్క రూపాయి కూడా కాపు సంక్షేమానికి వినియోగించలేదు. మళ్లీ గెలిస్తే రాబోయే ఐదేళ్లలో 4 విడతల్లో రూ.60వేలు ఇస్తామని, మొత్తం రూ.1.20లక్షలు అవుతుందని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. అంకెల గారడీ చేసి మొత్తం పదేళ్ల కాలానికి ఇచ్చింది, ఇవ్వబోయేది కలిపి చూపించింది.

  • ఉన్న ఒక్క పథకంలోనే మహిళలను మోసం చేసిన జగన్‌... లేని సంక్షేమం ఉన్నట్టుగా కాకి లెక్కలు వేశారు. ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చామని, కానీ చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.34 వేల కోట్లు ఖర్చు చేశామని మేనిఫెస్టోలో తెలిపారు.

  • ప్రజలందరికీ ఇచ్చే అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇతరత్రా మొత్తం పథకాల్లో ఉన్న కాపు లబ్ధిదారులను వెలికితీసి వారికి ఇచ్చిన మొత్తాన్ని కాపు సంక్షేమం కింద జమ కట్టేశారు.

దళితులకు మొండిచెయ్యి

దళితులకు సంబంధించి పలు పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేయడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. తాజా మేనిఫెస్టోలో అయినా వాటిని పునరుద్ధరిస్తామన్న హామీ ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు. మొత్తం జనాభాలో కనీసం 50శాతం దళితులు ఉండి, వారి జనాభా 500కు పైన ఉన్న అవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

తాము కోరని హామీలను మేనిఫెస్టోలో పెట్టి జగన్‌ కావాలని తమను అవమానిస్తున్నారని దళిత నేతలు వాపోతున్నారు. క్రైస్తవులకు, ముస్లింలకు ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి మాత్రం ప్రకటించారు.

2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, నిధులు వెచ్చించాం, ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం, ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చామని మేనిఫెస్టోలో గొప్పగా చెప్పుకున్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన జగన్‌ దానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు.

పెన్షన్లపై పేలవ హామీలు

  • సామాజిక పింఛన్ల లబ్ధిదారులను జగన్‌ సర్కారు ముప్పుతిప్పలు పెట్టింది. గత చంద్రబాబు ప్రభుత్వం 19లక్షల కొత్త పెన్షన్లు మంజూరుచేస్తే, 2019-2024 మధ్యకాలంలో జగన్‌ 12 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. బాబు హయాంలో రూ.200 నుంచి పెన్షన్‌ రూ.2వేలకు పెరిగింది.

  • జగన్‌ సర్కారు రూ.2వేల నుంచి ఐదేళ్లల్లో నాలుగు విడతల్లో తడవకు రూ.250 చొప్పున రూ.3వేలకు పెంచింది. పైగా లబ్ధిదారులు చంద్రబాబు హయాంలో 2నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు.

  • అప్పట్లో ఎక్కడున్నా పెన్షన్‌ పొందే అవకాశం ఉండేది. జగన్‌ ఈ వెసులుబాట్లు లేకుండా చేశారు. పింఛన్ల మొత్తాన్ని బీసీలకు రూ.4వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ హామీని ఇతర వర్గాలకూ విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్‌ రూ.5వేలు చేస్తారని లబ్ధిదారులు అతృతగా ఎదురుచూశారు. అయితే పెన్షన్‌ మొత్తాన్ని 2029 నాటికి రూ.3,500 చేస్తామని చెప్పడంతో వారంతా ఉసూరుమన్నారు.

  • అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని 2019 మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. మొదటి ఏడాది రూ.15వేలు ఇచ్చింది. మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.వెయ్యి తిరిగివ్వాలంటూ జగన్‌ కోరారు. రెండో ఏడాది రూ.వెయ్యి కోత పెట్టి రూ.14వేలే ఇచ్చింది.

  • ఆ తర్వాత ఏడాది పాఠశాలల నిర్వహణ కోసమంటూ మరో వెయ్యి కోత పెట్టి రూ.13 వేలే జమ చేసింది. చివరి సంవత్సరం అమ్మఒడి విడుదలే చేయలేదు. ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లు ఇస్తామని చెప్పిన జగన్‌.. నాలుగు విడతల్లో మాత్రమే, అందులోనూ కోతలతో అమ్మఒడి అమలు చేశారు.

  • చివరి ఏడాది రకరకాల సాకులతో 1.34 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. మళ్లీ గెలిస్తే ఏడాదికి రూ.17 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.85వేలు ఇస్తామని 2024 మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రూ.13 వేలు ఇస్తూ, రూ.15వేలకు లెక్కలు గట్టి మొత్తం ఇచ్చినట్లు ప్రకటించారు. కాగా 2019 ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు చొప్పున ఇస్తామని జగన్‌ సతీమణి భారతి ప్రచారం చేశారు. ఆ ప్రకటనపై ఎందుకు మాట తప్పారో కూడా సమాధానమివ్వలేదు.

హవ్వా.. ఇదెక్కడి లెక్క?

వైసీపీ మేనిఫెస్టో నిరుద్యోగుల కళ్లు బైర్లు కమ్మించింది. నిరుద్యోగులకు షాక్‌ ఇచ్చేలా డీఎస్సీ ద్వారా 21,108 పోస్టులను భర్తీ చేసేసినట్లు మేనిఫెస్టోలో అధికార పార్టీ నిస్సిగ్గుగా ప్రకటించింది. వైసీపీ పాలనలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

కోడ్‌ రావడంతో అది మధ్యలోనే ఆగిపోయింది. మరి మేనిఫెస్టోలో చెప్పినట్టు 21వేల పోస్టులు ఎక్కడినుంచి వచ్చాయనేది మిలియర్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మెగా డీఎస్సీ ద్వారా 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చివర్లో హడావుడిగా 6100 పోస్టులతో మినీ డీఎస్సీ ప్రకటించారు.

అదీ ఆగిపోయింది. 2018లో టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన 7729 పోస్టులు భర్తీ చేశారు. అలాగే పలు వివాదాలతో అర్హులుగా మిగిలిపోయిన 1998 డీఎస్సీలో 4534 మందిని, 2008 డీఎస్సీలో 1910 మందిని మినిమం టైమ్‌ స్కేలుపై కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుంది. వీరిలో చాలా మంది ఉద్యోగాల్లో చేరలేదు.

చేరినవారిలో నెల రోజులకే రిటైర్డ్‌ అయినవారు అనేక మంది ఉన్నారు. అయితే మొత్తం 21వేల మంది టీచర్లను భర్తీచేసినట్లు కాకి లెక్కలు వేసింది.

యూపీఎస్సీ తరహాలోనట!

అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. ఉద్యోగాల భర్తీ విషయంలో మాట తప్పారు. ఐదేళ్లలో 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వని ఏకైక ప్రభుత్వంగా ఘనత సాధించారు.

ఇకపై యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ జగన్‌ కొత్త పల్లవి అందుకున్నారు. ‘క్రమం తప్పకుండా గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఇచ్చి, యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహణ’ అని తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2019లోనూ ఇలాంటి హామీనే ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు. నాలుగున్నరేళ్లపాటు మౌనం వహించి చివర్లో 897 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఇచ్చారు. 111 పోస్టులతో ఒకేఒక్క గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను పూర్తిచేశారు. మొత్తంగా ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 5వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు.

వ్యవ‘సాయం’లోనూ కోత

గత ఎన్నికల ముందు రైతుభరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్న జగన్‌.. 2019-24 మధ్య ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 చొప్పున ఐదేళ్లలో ఇచ్చింది రూ.37,500 మాత్రమే.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద కేంద్రం ఏటా ఇస్తున్న రూ.6వేలు కూడా తన ఖాతాలో కలుపుకొని ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారు. తాజా మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.16వేల చొప్పున లబ్ది చేకూర్చుతామని ప్రకటించారు.

ఈ మొత్తాన్ని ఖరీఫ్‌ మొదట్లో రూ.8వేలు, పంట కోత సమయంలో రూ.4వేలు, సంక్రాంతికి రూ.4వేలు ఇస్తామని చెప్పారు. అంటే గతంలో మాదిరిగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సొమ్మును కలుపుకొంటారన్నది సుస్పష్టం. అంటే రాష్ట్రప్రభుత్వం చెల్లించేది రూ.10వేలు మాత్రమే.

అధికారంలోకి వస్తే.. ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.20వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

విశాఖపై ఉత్తుత్తి ప్రేమ

వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ ప్రకటించారు. గత మేనిఫెస్టోలో రాజధాని అంశం పెట్టలేదు. జగన్‌ సీఎం అయిన 6నెలల తర్వాత విశాఖ పరిపాలన రాజధానంటూ అసెంబ్లీలో ప్రకటించారు.

అప్పటినుంచి దసరాకి వెళ్తామని, దీపావళికి వెళ్తామని, వైజాగ్‌లో కాపురం ఉంటామని చెప్పడమే తప్ప ఆచరణలో సాధ్యపడలేదు. అయితే ఈ ఐదేళ్లలో జగన్‌ అనుచరవర్గం విశాఖను అడ్డంగా దోచుకున్నారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయి కబ్జాలకు పాల్పడ్డారు.

రుషికొండపై ఉన్న భవనాలు కూల్చేసి సీఎం నివాసం కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌ నిర్మించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని జగన్‌పై సొంత చెల్లి షర్మిలతో సహా ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం కూడా అమరావతే రాజధాని అన్న విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో కనీసం ఉత్తరాంధ్రలోనైనా ఓట్లకు గేలం వేయడం కోసం మేనిఫెస్టోలో రాజధాని అంశాన్ని జగన్‌ ప్రస్తావించారు.

పారిశ్రామికం.. తిరోగమనం

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలుగా ఇస్తున్న రాయితీలకు తోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో తిరోగమనం మొదలైంది.

జగన్‌ కక్షపూరిత వైఖరి, కమీషన్లు, వాటాల కోసం అధికార పార్టీ నాయకుల వేధింపులతో ఉన్న పరిశ్రమలు పారిపోవడమే తప్ప.. ఈ ఐదేళ్లలో కొత్తగా చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటీ రాలేదు. వైసీపీ పాలనలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎ్‌సఎంఈ)ల పరిస్థితి దారుణంగా తయారైంది.

ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో పరిశ్రమలు నడపలేక... బ్యాంకులకు అప్పుల వాయిదాలు కట్టలేక ఎంఎ్‌సఎంఈల నిర్వాహకులు నలిగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇంకా వందల సంఖ్యలో యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొనడంతో జగన్‌ సర్కారు 2021లో రూ.1,110 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించింది.

తొలివిడతగా రూ.440 కోట్లు విడుదల చేసింది. ఏటా ఆగస్టులో ప్రోత్సాహకాలు అందజేస్తామని సంక్షేమ కేలెండరులో ప్రకటించడమే తప్ప తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఈ మూడేళ్లలో ఎంఎ్‌సఎంఈలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు రూ.4వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి.

‘2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాం. ఐదేళ్లలో రూ. 85,543 కోట్ల పెట్టుబడులు.. 28.89లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎ్‌సఎంఈలకు రూ.2,087కోట్ల ప్రోత్సాహాలు అందించాం’ అంటూ 2024 మేనిఫెస్టోలో పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని పారిశ్రామికవేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

చేయూత, ఆసరాలో మాయ

వైఎ్‌సఆర్‌ చేయూత పథకంపై జగన్‌ మాయాజాలం చేశారు. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75వేలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ గెలిస్తే వచ్చే ఐదేళ్లలో కూడా నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పున మరో రూ.75వేలు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి అని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఇచ్చింది, ఇకపై ఇవ్వబోయేది అంతా కలిపి మొత్తం పదేళ్ల కాలానికి పెద్ద మొత్తంలో చూపించి అంకెల గారడీ చేశారు. ఇక ‘ఆసరా’లోనూ మేనిఫెస్టోలో మహిళలకు టోకరా వేశారు.

2019 ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ.25,571కోట్లు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దఫాల్లో ఇప్పటికే చెల్లించామని తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాంటి లబ్ధిని వచ్చే ఐదేళ్లలో మహిళలకు కల్పిస్తామని మాత్రం చెప్పలేదు. అయితే ఆసరా, జీరో వడ్డీ రుణాలు అంటూ అర్భాటం చేశారు. గతంలో చేసినవి మాత్రం చెప్పి గెలిస్తే వచ్చే ఐదేళ్లలోఏమిస్తామన్న అంశాన్ని గాలికొదిలేశారు.

డ్వాక్రా రుణాలకు గత చంద్రబాబు ప్రభుత్వంలో రూ.5 లక్షల వరకు జీరో వడ్డీ అమలు చేసేవారు. జగన్‌ వచ్చిన తర్వాత ఆ పరిమితి రూ.3 లక్షలకు కుదించారు.

దాని పరిమితిని పెంచుతారేమోనని ఆశించిన మహిళలకు నిరాశ ఎదురైంది. వచ్చే ఐదేళ్లు దీన్ని ఇలాగే కొనసాగిస్తామని తేల్చేశారు. కాగా, మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని, వార్డ్‌ మెంబర్‌ నుంచి మేయర్ల వరకు చట్టం చేసి మరీ అన్నింటా 50 శాతం పదవులు అక్కచెల్లెమ్మలకేనని మేనిఫెస్టోలో గతంలో చేసినవి చెప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా మహిళలకు రాజకీయంగా ఏం చేస్తారన్న విషయంపై స్పష్టంగా హామీలు ఇవ్వలేదు.

ఈబీసీ నేస్తం విషయంలో కూడా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ ప్రకటించలేదు. గతంలో ఇచ్చిన వాటిని మళ్లీ చెప్పుకోవడమే తప్ప ఈబీసీ మహిళలకు కొత్త హామీలు ఇవ్వలేదు. ఈబీసీ నేస్తం కొందరికి రెండేళ్లు మాత్రమే లభిస్తే, మరికొందరికి ఒక ఏడాది మాత్రమే అందాయి. నాలుగు విడతలు లబ్ధి పొందిన లబ్ధిదారులు చాలా తక్కువ మందే ఉన్నారు.

కాపు సంక్షేమం.. అంకెల గారడీ

కాపు సంక్షేమానికి ఏడాదికి రూ.2వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని 2019 మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. కానీ ఆ మేరకు కాపు కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదు. దానిని కప్పిపుచ్చుకొనేందుకు కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.

45-60ఏళ్ల వయసున్న పేద కాపు మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేలు చొప్పు న ఐదేళ్లలో రూ.75వేలు ఇస్తామని జగన్‌ పదేపదే చెప్పారు.

తీరా ఐదేళ్లలో నాలుగుసార్లు రూ.60వేలే ఇచ్చారు. 3.3 లక్షల మంది కాపు మహిళలకు ఏడాదికి రూ.500కోట్ల మేర రూ.2వేల కోట్లు ఇచ్చారు. ఇవికాకుండా మరొక్క రూపాయి కూడా కాపు సంక్షేమానికి వినియోగించలేదు. మళ్లీ గెలిస్తే రాబోయే ఐదేళ్లలో 4 విడతల్లో రూ.60వేలు ఇస్తామని, మొత్తం రూ.1.20లక్షలు అవుతుందని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. అంకెల గారడీ చేసి మొత్తం పదేళ్ల కాలానికి ఇచ్చింది, ఇవ్వబోయేది కలిపి చూపించింది.

ఉన్న ఒక్క పథకంలోనే మహిళలను మోసం చేసిన జగన్‌... లేని సంక్షేమం ఉన్నట్టుగా కాకి లెక్కలు వేశారు. ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చామని, కానీ చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.34 వేల కోట్లు ఖర్చు చేశామని మేనిఫెస్టోలో తెలిపారు.

ప్రజలందరికీ ఇచ్చే అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇతరత్రా మొత్తం పథకాల్లో ఉన్న కాపు లబ్ధిదారులను వెలికితీసి వారికి ఇచ్చిన మొత్తాన్ని కాపు సంక్షేమం కింద జమ కట్టేశారు.

దళితులకు మొండిచెయ్యి

దళితులకు సంబంధించి పలు పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేయడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. తాజా మేనిఫెస్టోలో అయినా వాటిని పునరుద్ధరిస్తామన్న హామీ ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు. మొత్తం జనాభాలో కనీసం 50శాతం దళితులు ఉండి, వారి జనాభా 500కు పైన ఉన్న అవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

తాము కోరని హామీలను మేనిఫెస్టోలో పెట్టి జగన్‌ కావాలని తమను అవమానిస్తున్నారని దళిత నేతలు వాపోతున్నారు. క్రైస్తవులకు, ముస్లింలకు ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి మాత్రం ప్రకటించారు.

2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, నిధులు వెచ్చించాం, ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం, ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చామని మేనిఫెస్టోలో గొప్పగా చెప్పుకున్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన జగన్‌ దానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు.

పెన్షన్లపై పేలవ హామీలు

సామాజిక పింఛన్ల లబ్ధిదారులను జగన్‌ సర్కారు ముప్పుతిప్పలు పెట్టింది. గత చంద్రబాబు ప్రభుత్వం 19లక్షల కొత్త పెన్షన్లు మంజూరుచేస్తే, 2019-2024 మధ్యకాలంలో జగన్‌ 12 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. బాబు హయాంలో రూ.200 నుంచి పెన్షన్‌ రూ.2వేలకు పెరిగింది.

జగన్‌ సర్కారు రూ.2వేల నుంచి ఐదేళ్లల్లో నాలుగు విడతల్లో తడవకు రూ.250 చొప్పున రూ.3వేలకు పెంచింది. పైగా లబ్ధిదారులు చంద్రబాబు హయాంలో 2నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు.

అప్పట్లో ఎక్కడున్నా పెన్షన్‌ పొందే అవకాశం ఉండేది. జగన్‌ ఈ వెసులుబాట్లు లేకుండా చేశారు. పింఛన్ల మొత్తాన్ని బీసీలకు రూ.4వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ హామీని ఇతర వర్గాలకూ విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్‌ రూ.5వేలు చేస్తారని లబ్ధిదారులు అతృతగా ఎదురుచూశారు. అయితే పెన్షన్‌ మొత్తాన్ని 2029 నాటికి రూ.3,500 చేస్తామని చెప్పడంతో వారంతా ఉసూరుమన్నారు.

అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని 2019 మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. మొదటి ఏడాది రూ.15వేలు ఇచ్చింది. మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.వెయ్యి తిరిగివ్వాలంటూ జగన్‌ కోరారు. రెండో ఏడాది రూ.వెయ్యి కోత పెట్టి రూ.14వేలే ఇచ్చింది.

ఆ తర్వాత ఏడాది పాఠశాలల నిర్వహణ కోసమంటూ మరో వెయ్యి కోత పెట్టి రూ.13 వేలే జమ చేసింది. చివరి సంవత్సరం అమ్మఒడి విడుదలే చేయలేదు. ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లు ఇస్తామని చెప్పిన జగన్‌.. నాలుగు విడతల్లో మాత్రమే, అందులోనూ కోతలతో అమ్మఒడి అమలు చేశారు.

చివరి ఏడాది రకరకాల సాకులతో 1.34 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. మళ్లీ గెలిస్తే ఏడాదికి రూ.17 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.85వేలు ఇస్తామని 2024 మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రూ.13 వేలు ఇస్తూ, రూ.15వేలకు లెక్కలు గట్టి మొత్తం ఇచ్చినట్లు ప్రకటించారు. కాగా 2019 ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు చొప్పున ఇస్తామని జగన్‌ సతీమణి భారతి ప్రచారం చేశారు. ఆ ప్రకటనపై ఎందుకు మాట తప్పారో కూడా సమాధానమివ్వలేదు.

హవ్వా.. ఇదెక్కడి లెక్క?

వైసీపీ మేనిఫెస్టో నిరుద్యోగుల కళ్లు బైర్లు కమ్మించింది. నిరుద్యోగులకు షాక్‌ ఇచ్చేలా డీఎస్సీ ద్వారా 21,108 పోస్టులను భర్తీ చేసేసినట్లు మేనిఫెస్టోలో అధికార పార్టీ నిస్సిగ్గుగా ప్రకటించింది. వైసీపీ పాలనలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

కోడ్‌ రావడంతో అది మధ్యలోనే ఆగిపోయింది. మరి మేనిఫెస్టోలో చెప్పినట్టు 21వేల పోస్టులు ఎక్కడినుంచి వచ్చాయనేది మిలియర్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మెగా డీఎస్సీ ద్వారా 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చివర్లో హడావుడిగా 6100 పోస్టులతో మినీ డీఎస్సీ ప్రకటించారు.

అదీ ఆగిపోయింది. 2018లో టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన 7729 పోస్టులు భర్తీ చేశారు. అలాగే పలు వివాదాలతో అర్హులుగా మిగిలిపోయిన 1998 డీఎస్సీలో 4534 మందిని, 2008 డీఎస్సీలో 1910 మందిని మినిమం టైమ్‌ స్కేలుపై కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుంది. వీరిలో చాలా మంది ఉద్యోగాల్లో చేరలేదు.

చేరినవారిలో నెల రోజులకే రిటైర్డ్‌ అయినవారు అనేక మంది ఉన్నారు. అయితే మొత్తం 21వేల మంది టీచర్లను భర్తీచేసినట్లు కాకి లెక్కలు వేసింది.

యూపీఎస్సీ తరహాలోనట!

అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. ఉద్యోగాల భర్తీ విషయంలో మాట తప్పారు. ఐదేళ్లలో 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వని ఏకైక ప్రభుత్వంగా ఘనత సాధించారు.

ఇకపై యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ జగన్‌ కొత్త పల్లవి అందుకున్నారు. ‘క్రమం తప్పకుండా గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఇచ్చి, యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహణ’ అని తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2019లోనూ ఇలాంటి హామీనే ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు. నాలుగున్నరేళ్లపాటు మౌనం వహించి చివర్లో 897 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఇచ్చారు. 111 పోస్టులతో ఒకేఒక్క గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను పూర్తిచేశారు. మొత్తంగా ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 5వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు.

వ్యవ‘సాయం’లోనూ కోత

గత ఎన్నికల ముందు రైతుభరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్న జగన్‌.. 2019-24 మధ్య ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 చొప్పున ఐదేళ్లలో ఇచ్చింది రూ.37,500 మాత్రమే.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద కేంద్రం ఏటా ఇస్తున్న రూ.6వేలు కూడా తన ఖాతాలో కలుపుకొని ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారు. తాజా మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.16వేల చొప్పున లబ్ది చేకూర్చుతామని ప్రకటించారు.

ఈ మొత్తాన్ని ఖరీఫ్‌ మొదట్లో రూ.8వేలు, పంట కోత సమయంలో రూ.4వేలు, సంక్రాంతికి రూ.4వేలు ఇస్తామని చెప్పారు. అంటే గతంలో మాదిరిగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సొమ్మును కలుపుకొంటారన్నది సుస్పష్టం. అంటే రాష్ట్రప్రభుత్వం చెల్లించేది రూ.10వేలు మాత్రమే.

అధికారంలోకి వస్తే.. ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.20వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

కాపు సంక్షేమం.. అంకెల గారడీ

కాపు సంక్షేమానికి ఏడాదికి రూ.2వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని 2019 మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. కానీ ఆ మేరకు కాపు కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదు. దానిని కప్పిపుచ్చుకొనేందుకు కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.

45-60ఏళ్ల వయసున్న పేద కాపు మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేలు చొప్పు న ఐదేళ్లలో రూ.75వేలు ఇస్తామని జగన్‌ పదేపదే చెప్పారు.

తీరా ఐదేళ్లలో నాలుగుసార్లు రూ.60వేలే ఇచ్చారు. 3.3 లక్షల మంది కాపు మహిళలకు ఏడాదికి రూ.500కోట్ల మేర రూ.2వేల కోట్లు ఇచ్చారు. ఇవికాకుండా మరొక్క రూపాయి కూడా కాపు సంక్షేమానికి వినియోగించలేదు. మళ్లీ గెలిస్తే రాబోయే ఐదేళ్లలో 4 విడతల్లో రూ.60వేలు ఇస్తామని, మొత్తం రూ.1.20లక్షలు అవుతుందని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. అంకెల గారడీ చేసి మొత్తం పదేళ్ల కాలానికి ఇచ్చింది, ఇవ్వబోయేది కలిపి చూపించింది.

ఉన్న ఒక్క పథకంలోనే మహిళలను మోసం చేసిన జగన్‌... లేని సంక్షేమం ఉన్నట్టుగా కాకి లెక్కలు వేశారు. ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చామని, కానీ చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.34 వేల కోట్లు ఖర్చు చేశామని మేనిఫెస్టోలో తెలిపారు.

ప్రజలందరికీ ఇచ్చే అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇతరత్రా మొత్తం పథకాల్లో ఉన్న కాపు లబ్ధిదారులను వెలికితీసి వారికి ఇచ్చిన మొత్తాన్ని కాపు సంక్షేమం కింద జమ కట్టేశారు.

దళితులకు మొండిచెయ్యి

దళితులకు సంబంధించి పలు పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేయడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. తాజా మేనిఫెస్టోలో అయినా వాటిని పునరుద్ధరిస్తామన్న హామీ ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు. మొత్తం జనాభాలో కనీసం 50శాతం దళితులు ఉండి, వారి జనాభా 500కు పైన ఉన్న అవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

తాము కోరని హామీలను మేనిఫెస్టోలో పెట్టి జగన్‌ కావాలని తమను అవమానిస్తున్నారని దళిత నేతలు వాపోతున్నారు. క్రైస్తవులకు, ముస్లింలకు ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి మాత్రం ప్రకటించారు.

2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, నిధులు వెచ్చించాం, ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం, ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చామని మేనిఫెస్టోలో గొప్పగా చెప్పుకున్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన జగన్‌ దానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు.

పెన్షన్లపై పేలవ హామీలు

సామాజిక పింఛన్ల లబ్ధిదారులను జగన్‌ సర్కారు ముప్పుతిప్పలు పెట్టింది. గత చంద్రబాబు ప్రభుత్వం 19లక్షల కొత్త పెన్షన్లు మంజూరుచేస్తే, 2019-2024 మధ్యకాలంలో జగన్‌ 12 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. బాబు హయాంలో రూ.200 నుంచి పెన్షన్‌ రూ.2వేలకు పెరిగింది.

జగన్‌ సర్కారు రూ.2వేల నుంచి ఐదేళ్లల్లో నాలుగు విడతల్లో తడవకు రూ.250 చొప్పున రూ.3వేలకు పెంచింది. పైగా లబ్ధిదారులు చంద్రబాబు హయాంలో 2నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు.

అప్పట్లో ఎక్కడున్నా పెన్షన్‌ పొందే అవకాశం ఉండేది. జగన్‌ ఈ వెసులుబాట్లు లేకుండా చేశారు. పింఛన్ల మొత్తాన్ని బీసీలకు రూ.4వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ హామీని ఇతర వర్గాలకూ విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్‌ రూ.5వేలు చేస్తారని లబ్ధిదారులు అతృతగా ఎదురుచూశారు. అయితే పెన్షన్‌ మొత్తాన్ని 2029 నాటికి రూ.3,500 చేస్తామని చెప్పడంతో వారంతా ఉసూరుమన్నారు.

అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని 2019 మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంది. మొదటి ఏడాది రూ.15వేలు ఇచ్చింది. మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.వెయ్యి తిరిగివ్వాలంటూ జగన్‌ కోరారు. రెండో ఏడాది రూ.వెయ్యి కోత పెట్టి రూ.14వేలే ఇచ్చింది.

ఆ తర్వాత ఏడాది పాఠశాలల నిర్వహణ కోసమంటూ మరో వెయ్యి కోత పెట్టి రూ.13 వేలే జమ చేసింది. చివరి సంవత్సరం అమ్మఒడి విడుదలే చేయలేదు. ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లు ఇస్తామని చెప్పిన జగన్‌.. నాలుగు విడతల్లో మాత్రమే, అందులోనూ కోతలతో అమ్మఒడి అమలు చేశారు.

చివరి ఏడాది రకరకాల సాకులతో 1.34 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. మళ్లీ గెలిస్తే ఏడాదికి రూ.17 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.85వేలు ఇస్తామని 2024 మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రూ.13 వేలు ఇస్తూ, రూ.15వేలకు లెక్కలు గట్టి మొత్తం ఇచ్చినట్లు ప్రకటించారు. కాగా 2019 ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు చొప్పున ఇస్తామని జగన్‌ సతీమణి భారతి ప్రచారం చేశారు. ఆ ప్రకటనపై ఎందుకు మాట తప్పారో కూడా సమాధానమివ్వలేదు.

హవ్వా.. ఇదెక్కడి లెక్క?

వైసీపీ మేనిఫెస్టో నిరుద్యోగుల కళ్లు బైర్లు కమ్మించింది. నిరుద్యోగులకు షాక్‌ ఇచ్చేలా డీఎస్సీ ద్వారా 21,108 పోస్టులను భర్తీ చేసేసినట్లు మేనిఫెస్టోలో అధికార పార్టీ నిస్సిగ్గుగా ప్రకటించింది. వైసీపీ పాలనలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

కోడ్‌ రావడంతో అది మధ్యలోనే ఆగిపోయింది. మరి మేనిఫెస్టోలో చెప్పినట్టు 21వేల పోస్టులు ఎక్కడినుంచి వచ్చాయనేది మిలియర్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మెగా డీఎస్సీ ద్వారా 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చివర్లో హడావుడిగా 6100 పోస్టులతో మినీ డీఎస్సీ ప్రకటించారు.

అదీ ఆగిపోయింది. 2018లో టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన 7729 పోస్టులు భర్తీ చేశారు. అలాగే పలు వివాదాలతో అర్హులుగా మిగిలిపోయిన 1998 డీఎస్సీలో 4534 మందిని, 2008 డీఎస్సీలో 1910 మందిని మినిమం టైమ్‌ స్కేలుపై కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుంది. వీరిలో చాలా మంది ఉద్యోగాల్లో చేరలేదు.

చేరినవారిలో నెల రోజులకే రిటైర్డ్‌ అయినవారు అనేక మంది ఉన్నారు. అయితే మొత్తం 21వేల మంది టీచర్లను భర్తీచేసినట్లు కాకి లెక్కలు వేసింది.

యూపీఎస్సీ తరహాలోనట!

  • అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. ఉద్యోగాల భర్తీ విషయంలో మాట తప్పారు. ఐదేళ్లలో 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వని ఏకైక ప్రభుత్వంగా ఘనత సాధించారు.

  • ఇకపై యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ జగన్‌ కొత్త పల్లవి అందుకున్నారు. ‘క్రమం తప్పకుండా గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఇచ్చి, యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహణ’ అని తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2019లోనూ ఇలాంటి హామీనే ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు. నాలుగున్నరేళ్లపాటు మౌనం వహించి చివర్లో 897 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఇచ్చారు. 111 పోస్టులతో ఒకేఒక్క గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను పూర్తిచేశారు. మొత్తంగా ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 5వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు.

వ్యవ‘సాయం’లోనూ కోత

గత ఎన్నికల ముందు రైతుభరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్న జగన్‌.. 2019-24 మధ్య ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 చొప్పున ఐదేళ్లలో ఇచ్చింది రూ.37,500 మాత్రమే.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద కేంద్రం ఏటా ఇస్తున్న రూ.6వేలు కూడా తన ఖాతాలో కలుపుకొని ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారు. తాజా మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.16వేల చొప్పున లబ్ది చేకూర్చుతామని ప్రకటించారు.

ఈ మొత్తాన్ని ఖరీఫ్‌ మొదట్లో రూ.8వేలు, పంట కోత సమయంలో రూ.4వేలు, సంక్రాంతికి రూ.4వేలు ఇస్తామని చెప్పారు. అంటే గతంలో మాదిరిగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సొమ్మును కలుపుకొంటారన్నది సుస్పష్టం. అంటే రాష్ట్రప్రభుత్వం చెల్లించేది రూ.10వేలు మాత్రమే.

అధికారంలోకి వస్తే.. ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.20వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Read Also AndhraPradesh Elections News..

Updated Date - Apr 28 , 2024 | 08:47 AM

Advertising
Advertising