AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..
ABN, Publish Date - Apr 19 , 2024 | 10:57 AM
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 19: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు (AP Elections) జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి (YSRCP) మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు. వైసీపీకి గుడ్‌బై చెప్పేసి మరీ టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా ఇబ్రహింపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏకంగా మంత్రి జోగిరమేష్‌కు (Minister Jogi Ramesh) ఆయన బంధువులే పెద్ద షాక్ ఇచ్చారు.
YS Jagan: సొంత జిల్లాలోనే సీఎం జగన్‌కు బొమ్మ పడుతోంది!!
ఇబ్రహింపట్నంలో స్వయానా జోగి రమేష్ బామ్మర్థులే ఆయన హ్యాండ్ ఇచ్చేసి టీడీపీ పార్టీలోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం జోగి రమేష్ బామ్మర్థులు పామర్తి దుర్గాప్రసాద్ , పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. జోగు రమేష్ ఇంటి ముందునే సభాస్థలి ఏర్పాటు చేసి మరీ టీడీపీలోకి 40 మంది జోగిబంధువర్గం చేరింది. వారందరికీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ (TDP MLA Candidate Vasantha Krishna Prasad) తెలుగుదేశం పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే జోగి బంధువలే ఇలా పార్టీ మారడంతో వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ విషయంపై మంత్రి జోగి రమేష్ స్పందన ఎలా ఉండబోతోందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికల ఫేజ్1 ఓటింగ్ షూరూ.. ఎంత మంది పోటీ అంటే..
AP Elections 2024: సీఎస్, డీజీపీ ఔట్!?
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 19 , 2024 | 01:55 PM