ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Apr 28 , 2024 | 01:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) భానుడు భగభగలే కాదు.. పొలిటికల్(AP Politics) శగలు కూడా పెరుగుతున్నాయి. ఆయా పార్టీల నేతల మాటలతో.. హీట్ పుట్టిస్తున్నారు. మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. పొలిటిల్ లీడర్స్ తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఏపీ రాజకీయాలపై నటి జయప్రద(Jayapradha) ఇంట్రస్టింగ్ కామెంట్స్

Jayapradha

తిరుమల, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) భానుడు భగభగలే కాదు.. పొలిటికల్(AP Politics) శగలు కూడా పెరుగుతున్నాయి. ఆయా పార్టీల నేతల మాటలతో.. హీట్ పుట్టిస్తున్నారు. మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. పొలిటిల్ లీడర్స్ తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు.

ఈ క్రమంలోనే.. తాజాగా ఏపీ రాజకీయాలపై నటి జయప్రద(Jayapradha) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారిని(Tirumala Sri Venkateswara Swamy) దర్శించుకున్న ఆమె.. పనిలో పనిగా ఆంధ్ర రాజకీయాలపై తన మనసులోని మాటను వెలిబుచ్చారు.


ఆదివారం నాడు నటి జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన జయప్రద.. ఏపీ పాలిటిక్స్‌పై కీలక కామెంట్స్ చేశారు. బంగారు ఆంధ్రప్రదేశ్ కావడంతో పాటు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు జయప్రద. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆహ్వానిస్తే ఏపీలో ప్రచారం చేస్తానని అన్నారు.


తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించిన నటి జయప్రద.. ఆ తరువాత యూపీలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ తరువాత ఆర్ఎల్‌డీలో చేరారు. 2019లో జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ.. పార్టీ తరఫున ఆమె ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఏపీలో ఎన్డీయే తరఫున ప్రచారానికి తాను సిద్ధం అని అన్నారు. బీజేపీ అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నెరవేరుస్తానని, తనను ఆహ్వానిస్తే ఏపీలో ప్రచారం చేస్తానని జయప్రద చెప్పారు.


ఇవికూడా చదవండి:

అక్కడ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్!

పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 28 , 2024 | 01:27 PM

Advertising
Advertising