ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Polling 2024:వైసీపీ అరాచకాలతో ఓటర్లలో భయాందోళనలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ABN, Publish Date - May 13 , 2024 | 05:33 PM

ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తోంది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు.

Election Commission

ఢిల్లీ: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తోంది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ(BJP) నేతలు ఫిర్యాదు చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింస జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ చర్యలతో చాలామంది ఓటర్లు ఓటు వేయకుండానే ఇళ్లకు వెళ్లాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార వైసీపీ తమ గూండాలతో అరాచకాలు, గూండాయిజం, హింస ద్వారా ప్రజాస్వామ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతొందని ఈసీ దృష్టికి బీజేపీ నేతలు తీసుకెళ్లారు. పోలీసుల నిర్లక్ష్యం, ఓటింగ్ మందగమనం వల్లే వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయాన్ని చూసి గూండాలు, అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు పెద్దఎత్తున ఓటు వేయడానికి వచ్చి... భారీగా క్యూల్లో నిలబడ్డారని... వైసీపీ అరాచకాలు, హింసాత్మక ఘటనలు కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.


Chandrababu: పల్నాడులో హింసపై చంద్రబాబు సీరియస్..

ఓటర్లపై దాడులు

‘‘వైసీపీ వ్యవహారం ప్రజాస్వామ్యం పట్ల ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వీడియోలు, ఫొటోలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లపై దాడులతో పాటు సాధారణ ఓటర్లపై భయంకరమైన హింసాత్మక దాడులు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పదికి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లపై వైసీపీ గూండాలు లాఠీచార్జి చేయడంతో చాలా పోలింగ్ బూతులు రక్తపాతాన్ని తలపించాయి. గత రాత్రి మాచర్ల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు హత్యకు గురైనప్పటికీ ఎలాంటి పోలీసు చర్యలు తీసుకోలేదు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఎన్డీఏ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలుపై దాడి జరిగింది’’ అని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


పోలింగ్ బూత్‌లను కబ్జా చేశారు

‘‘పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్‌ను ఈరోజు ఉదయం కిడ్నాప్‌ చేశారు. తాడిపత్రిలో పోలింగ్ ఏజెంట్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరించారు. ప్రకాశం జిల్లా దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ క్యాప్చర్ చేశారు. దర్శి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్తపై హత్యాయత్నం జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గొండు శంకర్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తుండగా వైసీపీ గూండాలు దాడి చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లను జగన్ పార్టీ గూండాలు కబ్జా చేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ బూత్‌లను కబ్జా చేస్తూ ఎన్డీయే అభ్యర్థులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లను బెదిరించడంతోపాటు ఓటర్లపైనా దాడులు చేస్తున్నారు. ఈ హింసాత్మక చర్యలన్నీ పోలీసు రక్షణలో జరుగుతున్నాయి ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు కోరారు.

AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 05:48 PM

Advertising
Advertising