Purandeshwari: దళిత యువకుల మృతికి కారణమైన హోంమంత్రిని ప్రజలు తిప్పికొట్టాలి
ABN, Publish Date - Apr 24 , 2024 | 10:01 AM
Andhrapradesh: అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. బుధవారం గోపాలపురం మండలం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న బీజేపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి పూరందేశ్వరికి తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
తూర్పుగోదావరి, ఏప్రిల్ 24: అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కోరారు. బుధవారం గోపాలపురం మండలం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న బీజేపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి పూరందేశ్వరికి తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అక్రమ సంపాదనపై దృష్టి తప్ప, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆగ్రహించారు. దళిత యువకులకు మృతికి కారణమైన హోం మంత్రి వనితను ప్రజల తిప్పికొట్టాలన్నారు.
Hyderabad: వేడి గాలులతో డేంజర్.. ఒంట్లో నీటి శాతం తగ్గి అస్వస్థత
ఫ్లెక్సీల విషయంలో దళిత యువకుడు బలవన్మరణానికి హోం మంత్రి కారణమయ్యారని మండిపడ్డారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గోపాలపురం నియోజవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్మశాన భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకుల ప్రలోభాలకు, బెదిరింపులకు ప్రజలు లొంగవద్దన్నారు.
Congress: ఉపాధి హామీ కూలీలతో మమేకమైన సీతక్క
మే 13న స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పురందేశ్వరి వినతి చేశారు. కాగా.. పూరందేశ్వరితో పాటు గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు కూడా జిల్లా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భారీగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: వైసీపీ సోషల్ మీడియా మీటింగ్.. యువతి ప్రశ్నకు కంగుతిన్న వైఎస్ జగన్!!
AP Elections: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు చుక్కెదురు
Read latest AP News And Telugu News
Updated Date - Apr 24 , 2024 | 10:47 AM