TDP: జూన్ 4 తర్వాత వైసీపీ నేతలను తలచుకుంటేనే.. బోండా ఉమ వ్యంగ్యాస్త్రాలు
ABN, Publish Date - Jun 03 , 2024 | 06:34 PM
అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు.
అమరావతి: అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు. అధిక అప్పులు చేసి ఏం చేయాలో అర్థం కాక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. అధికారం పోతోందని తెలిసి వైసీపీ నాయకులకు పిచ్చిపట్టినట్లైందని ఎద్దేవా చేశారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మంత్రులు, సలహదారులు టీడీపీ నేతలపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.
5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల జీవితాలతో వైసీపీ ఆడుకుందని ఫైర్ అయ్యారు. గత నెల నుంచి రూ. 30 వేల పై చిలుకు అప్పులు తెచ్చారు, ఏంచేశారు? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల అప్పులయ్యాయి. ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. వైసీపీ ఘోర పరాజయంపాలు కానుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. బందిపోటు దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఏకమైనట్లు జగన్‌ని ఊరి పొలిమేర దాటించడానికి ప్రజలంతా ఏకమయ్యారని సెటైర్లు గుప్పించారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో ఈవీఎంలు పగులగొట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో తిరగబడండని కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారన్నారు. జగన్ అవినీతి, అసమర్థ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ఆరోపించారు. వైసీపీ మంత్రులు జూన్ 4 తర్వాత రాష్ట్రం వదలి పారిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం పెట్టిన నియమ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరగాలని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!
Delhi Liquor Scam::కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. సంచలన విషయాలు వెలుగులోకి..!
CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!
Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
For More AP News and Telugu News..
Updated Date - Jun 03 , 2024 | 08:07 PM