AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపీణీపై ఓ కన్నేసిన సీఈసీ
ABN, Publish Date - Apr 04 , 2024 | 12:20 PM
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా సమాచారం సేకరిస్తోంది. పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ల ద్వారా పెన్షన్‌ల పంపిణీ జరుగుతున్న తీరుపై ఈసీ వివరాల సేకరించే పనిలో పడింది.
అమరావతి, ఏప్రిల్ 4: ఎన్నో ఆటంకాలు, అనేక వివాదాలు నడుమే ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) పెన్షన్ల పంపిణీ (AP Pensions) ప్రక్రియ కొనసాగుతోంది. పెన్షన్ల పంపిణీ విషయంలో అధికారపార్టీ, టీడీపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తుండగా.. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణం తెలుగుదేశం పార్టీనే అంటూ వైసీపీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా సమాచారం సేకరిస్తోంది. పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ల ద్వారా పెన్షన్‌ల పంపిణీ జరుగుతున్న తీరుపై ఈసీ వివరాల సేకరించే పనిలో పడింది. జిల్లాల వారీగా సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అబ్జర్వర్లు పంపిస్తున్నారు. పెన్షన్‌లపై నెలకొన్న వివాదం, ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
LS Polls 2024: రాహుల్‌కు షాక్.. వయనాడ్‌కు స్మృతి ఇరానీ..
తొలిరోజు ఇలా...
మరోవైపు ఏపీ పింఛన్ల పంపిణీలో భాగంగా తొలిరోజు బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించినట్టు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్థి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసిందన్నారు. మొత్తం 14,994 గ్రామ, వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించినట్టు తెలిపారు. గురువారం నుంచి ఉదయం 7 గంటలకే పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని శశిభూషణ్ కుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రాహుల్‌కు రూ.20 కోట్ల స్తిర, చరాస్తులు.. ఆసక్తికర విషయం ఏంటంటే..
Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 04 , 2024 | 01:37 PM