ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: పాపాల పెద్దిరెడ్డి నీకిక నిద్ర పట్టదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

ABN, Publish Date - May 07 , 2024 | 06:57 PM

జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

చిత్తూరు: జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.


AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

‘‘మాతో నీకు పోలిక ఏంటి పాపాల పెద్దిరెడ్డి. పొగరబోతు, ఆంబోతుగా పెద్దిరెడ్డి తయారయ్యాడు. ఆయన రాజకీయ అహంకారానికి గండి పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. నీకిక నిద్ర పట్టదు. నీ శివశక్తి డెయిరీకి తప్ప వేరే డెయిరీలకు పాలు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నావ్. అక్రమ ఇసుక, మద్యం కాంట్రాక్ట్‌లు అన్ని నీ కుటుంబానివే. రూ. 32 వేల కోట్ల అవినీతి చేశాడు. నీ ఊరికి పోయినందకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టావ్.చల్లాబాబుపై ఎన్నో కేసులు పెట్టావ్....కానీ మా వాళ్లు భయపడలేదు. నా నుంచి తప్పించుకోగలవా.... నిన్ను వదిలిపెట్టాను. అంగళ్లులో వైసిపీ మూకలతో నాపైన రాళ్లదాడి చేయించి...నాతో పాటు 800 మందిపై కేసులు పెట్టావ్. నా కార్యకర్తలను వేధింపులకు గురిచేశావ్... ఏది మరిచిపోలేదు, నువ్వు చేసిన అరాచకాలు.. నా నరనర్రాల్లో ఉన్నాయి. జగన్ ఒక సైకో... ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాకా... గుద్దులే గుద్దులే, బాదుడే బాదుడే’’ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు.


జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు 200 శాతం పెంచేశారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో జగన్, పెద్దిరెడ్డి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. రూ. వంద రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు... నేడు వెయ్యికి పెంచేశారని ఫైర్ అయ్యారు. జగన్‌కు తగిలిన గులకరాయి కనబడదు, దెబ్బ మాత్రం తగిలిందని ఎద్దేవా చేశారు. నాడు కోడికత్తి డ్రామా...నేడు గులకరాయి డ్రామా ఆడి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారని మండిపడ్డారు.‘‘ఎవరికి చెప్తావ్ నీ డ్రామాలు జగ్గుబాయ్....నార్త్ కొరియాలో కిమ్‌లాగా...మన ఏపీలో జిమ్‌‌లాగా జగన్ ఉన్నారు’’ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు. ఏపీలో ఎవరు ఆనందంగా ఉండకూడదని.. మొత్తం డబ్బు తన దగ్గరే ఉండాలనేది జగన్ దుర్భుద్ధి అని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను జగన్, పెద్దిరెడ్డి దగ్గర జూన్ 4 తర్వాత కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 07:14 PM

Advertising
Advertising