Chandrababu: ప్రచారానికి ఇంకా 20 రోజులే... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 21 , 2024 | 04:42 PM
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం నాడు బీ ఫామ్స్ (B forms) అందజేశారు. బీ ఫామ్స్ అందజేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం నాడు బీ ఫామ్స్ (B forms) అందజేశారు. బీ ఫామ్స్ అందజేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీ ఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలిచి రావాలని ఆశీర్వదించారు. ఏపీకి ఏం చేశారో చెప్పుకోలేకే సీఎం జగన్ (CM Jagan) డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.
Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్
సంకల్పంతో అభ్యర్థులు ముందుకెళ్లాలి
పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు. మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉందని.. ఈ సమయం ఎంతో కీలకమని సూచించారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం... సంకల్పంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను దీవించారు. ప్రజలు గెలవాలి... రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదమని అన్నారు.
TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..
ఓటు బదిలీ జరగాలి..
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలని.. ఓటు బదిలీ జరగాలని అన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనాన్ని చాటిచెబుతోందన్నారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత..
పార్టీ క్యాడర్‌తో ప్రతి అభ్యర్థి అనుసంధానం కావాలని సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. వైసీపీలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా చాలామంది ఆ పార్టీ నేతలు బయటకు వచ్చి టీడీపీలో చేరారని తెలిపారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి మంచి వాళ్లను మాత్రమే తీసుకుని సీట్లు ఇచ్చానని గుర్తుచేశారు. పార్టీలో కొత్తగా చేరిన నేతలు పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు ఇంకా 22 రోజుల సమయమే ఉందని.. .ప్రచారానికి 20 రోజులే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..
తాను ఇప్పటికే 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించానని పేర్కొన్నారు. పలు సభలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోనూ కలిసి నిర్వహించానని వివరించారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ సిద్ధహస్తుడని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోనూ సానుభూతితో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ప్రచారం చేసుకున్నారని అన్నారు.
బోండా ఉమాపై కుట్రలు..
జగన్ బస్సు యాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారని.. తనపై అంభాడాలు మోపుతున్నారని మండిపడ్డారు. చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ఫ్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారని దుయ్యబట్టారు. రాయి విసిరిన వ్యక్తితో టీడీపీ నేత బోండా ఉమమహేశ్వరరావు ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
ఏపీని అడ్డగోలుగా దోచుకున్నారు..
వలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో పెన్షన్లు ఆగిపోయాయని తనపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. కానీ మళ్లీ ఆయనే తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి, పోలవరాన్ని విధ్వంసం చేశారని.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Elections: వైసీపీ ఆశలు ఆవిరి.. ఆ నియోజకవర్గంలో వ్యూహం మార్చిన బీజేపీ..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం...
Updated Date - Apr 21 , 2024 | 06:53 PM