ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu: పోలింగ్ ముగిసిన వేళ చంద్రబాబు ఆసక్తికరమైన ట్వీట్

ABN, Publish Date - May 13 , 2024 | 07:02 PM

ఏపీలో పోలింగ్ ముగిసిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోలింగ్ రోజుని రాష్ట్రంలో ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన..

ఏపీలో పోలింగ్ (AP Elections) ముగిసిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోలింగ్ రోజుని రాష్ట్రంలో ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన.. ఓటు వేసేందుకు ప్రజలు చూపుతున్న ఉత్సాహం స్ఫూర్తిని నింపుతోందని అన్నారు. నిర్దేశిత పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో ఓటర్లు 6 గంటలకు కూడా క్యూ లైన్‌లో బారులు తీరి ఉన్నారన్నారు. ఎలక్షన్ కమీషన్ ఆ పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరాను పరిశీలించి.. వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.


ఇదిలావుండగా.. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఎంతో చురుకుగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం నెలకొన్నా, అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నా, వర్షాలు పడినా.. లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 71 లక్షలకు పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుషులు ఉండగా, 1.40 కోట్లకు పైగా మహిళలు ఉన్నట్లు తేలింది. పురుషులతో పోలిస్తే.. మహిళలే ఈ పోలింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారు.

Read Latest Andhra Pradesh News and Telangana News

Updated Date - May 13 , 2024 | 07:02 PM

Advertising
Advertising