ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ABN Big Debate With CBN: నన్ను చంపేస్తామని బెదిరించారు.. బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

ABN, Publish Date - May 08 , 2024 | 09:44 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.

ABN Big Debate With CBN

ABN Big Debate With CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది. ఆ సమయంలో జైలులో జరిగిన సంఘటనలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో చంద్రబాబు నాయుడు పంచుకున్నారు.


జైల్లో అలా ప్లాన్ చేశారు.. చంద్రబాబు

‘‘నన్ను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వచ్చారు.ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలని అడిగా. కానీ.. అధికారుల నుంచి సమాధానం రాలేదు. జైల్లో మంచం, కంచం లేకుండా చేయాలని చూశారు. నన్ను సీసీ కెమెరాలో చూస్తూ ఆనందపడ్డారు. జైలుపై డ్రోన్లు ఎగరేశారు. నా సెల్లోకి దోమలు రాకుండా కంట్రోల్‌ చేయాలని పోరాడా.రిపోర్టులు కూడా తారుమారు చేశారు..నన్ను చంపాలని అనుకున్నారు. నాకు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వకుండా చేశారు. నేను తప్పు చేయకుండా శిక్ష అనుభవించా. నేను తప్పు చేయలేదని జనం నమ్మారు. 53 రోజులు జైల్లో ఉంటే విదేశాల్లోనూ జనం ఉద్యమించారు.ఇంతగా నమ్మిన జనం కోసమే జీవితాంతం పనిచేస్తా. నేను ఏం చేస్తానో జూన్‌ 4 తర్వాత చూస్తారు. ఒక వ్యక్తినే నేను టార్గెట్‌ చేయను. నన్ను అరెస్ట్‌ చేయాలంటూ అధికారుల్ని బెదిరించారు. లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఓ ఆఫీసర్‌ నాకు స్వయంగా చెప్పారు’’ అని చంద్రబాబు తెలిపారు.


కేసీఆర్‌ ఇలా చేయలేదు...

‘‘జగన్‌ సైకో అని అంటే చాలామంది నమ్మలేదు. జగన్‌ మనస్తత్వం గురించి చాలామంది రాశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైకో అనే అంటున్నారు. కానీ, జగన్‌ సైకో కంటే ఎక్కువ. ఏ ముఖ్యమంత్రి కూడా మీడియాను టచ్‌ చేయలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మీడియాపై ఆంక్షలు పెడితేనే నేను వ్యతిరేకించా. మీడియాను కూడా జగన్‌ భయపెడుతున్నాడు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఇంత కక్షపూరితంగా వ్యవహరించలేదు. 40 ఏళ్లలో నా భార్య భువనేశ్వరి తొలిసారి రోడ్డుపైకి వచ్చారు.ఈ మధ్య కొన్నిసార్లు ఆవేశంలో మాట తూలుతున్నా. నాకు జరిగిన అవమానాలు దేశంలో ఎవరికీ జరగలేదు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తోంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు అండగా నిలబడ్డారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు అండగా నిలబడ్డారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి. అన్నిచోట్లా తెలుగుజాతి నంబర్‌వన్‌గా ఉండాలి. పేదరికం లేకుండా చేయడమే నా లక్ష్యం. 45 ఏళ్లలో ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. సంతకం పెట్టాక కూడా మళ్లీ చెక్‌ చేసుకునేవాడిని’’ అని బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు పలు కీలక విషయాలు వెల్లడించారు.

Updated Date - May 08 , 2024 | 10:11 PM

Advertising
Advertising