ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. సీఎం జగన్ ఇలా అన్నారే..?

ABN, Publish Date - May 01 , 2024 | 04:18 PM

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే ఈ యాక్ట్‌తో పేదలు చాలా నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలకు సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) సరైన వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు దిమ్మతిరిగేలా జగన్ కౌంటర్ ఇచ్చారు.

CM Jagan

అనకాపల్లి జిల్లా: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే ఈ యాక్ట్‌తో పేదలు చాలా నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలకు సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) సరైన వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు దిమ్మతిరిగేలా జగన్ కౌంటర్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ యాక్ట్ వల్ల భూములపై సర్వహక్కులు కల్పించబడుతాయని స్పష్టం చేశారు.


Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

తాను భూములు ఇచ్చే వాడినే కానీ.. లాక్కోవడం మాత్రం తెలీదన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోయినా జనానికి తెలుసునని చెప్పారు. రికార్డుల ప్రక్షాళన కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని తీసుకొచ్చామని తేల్చిచెప్పారు. తనకు ఈ ఎన్నికల్లో ఓటేస్తే పథకాలు కొనసాగిస్తానని.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు పలికినట్లేనని ఉద్ఘాటించారు. పాయకరావుపేటలో బుధవారం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసగించారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందని అన్నారు. ఈ యుద్ధం తనకు, చంద్రబాబుకు మధ్య కాదని.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోయే యుద్ధామని జగన్ అన్నారు.


Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

తన పాలనలో పేదల కోసం ప్రకటించిన మంచి పథకాలను చూసి చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందన్నారు. ఐదేళ్లలో గతంలో ఎన్నడూ చూడని విప్లవం తీసుకొచ్చానని చెప్పారు. పొరపాటున ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే మంచి పథకాలకు ముగింపు పలికినట్లేనని.. మళ్లీ మోసపోవడమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో వేసే ఓటు ఐదేళ్ల అభివృద్ధిని, పేదల భవిష్యత్తును నిర్ణయించేదని ఉద్ఘాటించారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటేవేయొద్దని జగన్ సూచించారు.


చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పని కూడా ప్రజలకు గుర్తు లేదన్నారు. ఆయన మోసాలు, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని మండిపడ్డారు. 14ఏళ్ల పాటు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబుకు పెన్షన్ ఇంటి వద్ద ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయలేదా అని నిలదీశారు. అవ్వా తాతల నుంచి వ్యతిరేకత వచ్చే సరికి తన మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 04:37 PM

Advertising
Advertising