AP Elections: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
ABN, Publish Date - May 16 , 2024 | 01:41 PM
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి, మే 16: ఏపీ ఎన్నికల ఫలితాలపై (Election Results) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్.. ఐప్యాక్ టీం (I-PAC Team) సభ్యులతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఐప్యాక్ టీమ్ ఈసారి కూడా వైసీపీకి (YSRCP) ఎన్నికల సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే.
Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’
ప్రశాంత్ కంటే రిషీ టీం చాలా వర్తీ...
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్‌ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నందిగం సురేష్, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. ఐప్యాక్ టీంతో భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.
ఇవి కూడా చదవండి...
TDP: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్
LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!
Read Latest AP News AND Telugu News
Updated Date - May 16 , 2024 | 03:49 PM