AP Elections: రాజ్యాంగం మార్పు విషయంపై ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాల్సిందే: రామకృష్ణ
ABN, Publish Date - May 04 , 2024 | 11:31 AM
Andhrapradesh: అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత ప్రధాన కార్యదర్శి దురుషాంత్ కుమార్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారని.. దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే మాత్రం కచ్చితంగా రాజ్యాంగం మారుస్తారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు రాజ్యాంగం మార్పు విషయంపై వారి వైఖరిని ఓటర్లకు చెప్పాలన్నారు.
అనంతపురం, మే 4: అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత ప్రధాన కార్యదర్శి దురుషాంత్ కుమార్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారని.. దేశంలో బీజేపీకి (BJP) మెజార్టీ వస్తే మాత్రం కచ్చితంగా రాజ్యాంగం మారుస్తారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు రాజ్యాంగం మార్పు విషయంపై వారి వైఖరిని ఓటర్లకు చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రధాని మోదీ చెప్పారన్నారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారు.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
AP Pension: పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధులు
బీసీ కుల గణన చేయడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. ల్యాడ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజల్లో , లాయర్లకు, కొన్ని రాజకీయ పార్టీలకు అనుమానం ఉందని తెలిపారు. ఈ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని వైసీపీ (YSRCP) చెబోతోందన్నారు. ఈ యాక్ట్‌ను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేదన్నారు. జగన్ వెంటనే ఈ యాక్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫించన్ల పంపిణీలో సచివాలయం ఉద్యోగులను, టీచర్లను ఉపయోగిస్తే పంపిణీ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఫించన్ల కోసం వెళ్లి 7 మంది చనిపోయారని.. వీరి ఉసురు అధికారంలో ఉన్న అధికారులకు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు.
Loksabha Polls 2024: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు 10 వేల కోట్ల రూపాయలను ఓటర్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వారిని ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఈసీ సరిగ్గా ఎన్నికలను నిర్వహించడం లేదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ రెండు మైకులు పెట్టుకున్న వారి దగ్గరకి వస్తోంది తప్ప లిక్కర్, డబ్బులు పంచుతున్న వారిని ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ అభాసుపాలు చేస్తోందని రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?
Read Latest AP News And Telugu News
Updated Date - May 04 , 2024 | 11:56 AM