AP News: జగన్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు: కనకమేడల
ABN, Publish Date - May 09 , 2024 | 01:21 PM
Andhrapradesh: ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్ళీ జగన్ లాంటి ముఖ్యమంత్రి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు గొడ్డలి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓటుతో జగన్‌కు సమాధానం చెప్పాలన్నారు.
న్యూఢిల్లీ, మే 9: ఏపీలో (Andhrapradesh) ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Former MP kanakamedala Ravindra kumar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్ళీ జగన్ (CM Jagan) లాంటి ముఖ్యమంత్రి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు గొడ్డలి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓటుతో జగన్‌కు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం చేయలేని విధంగా ప్రజలు ఓట్లు వేయనుని కోరారు. ఏపీలో ప్రజలు సైలెంట్ ఓటు వేయనున్నారన్నారు. జగన్ నుంచి ప్రజలు విముక్తి, భూములు కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమిని, చంద్రబాబును సీఎంగా గెలిపించాలని కోరారు.
AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్
ఏపీలో ఆదివారం బ్యాంకులు ఓపెన్ చేయమనడంపై అనుమానం కలుగుతోందన్నారు. జగన్ బటన్ నొక్కితే సాక్షికి డబ్బులు వెళ్ళాయి కానీ పథకాలకు వెళ్ళలేదని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు తండ్రి ముఖం కనిపించకుండా చేస్తున్నారన్నారు. తండ్రి పేరును ముద్దాయిగా సీబీఐ ఛార్జ్ షీట్‌లో చేర్పించిన ఘనత జగన్ ది అంటూ వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలను జగన్ ఇప్పటి వరకు ఖండించలేదన్నారు. జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. జగన్ చివరి 35 రోజుల్లో 13 వేల కోట్లు అప్పు చేశారని తెలిపారు. సర్క్యూట్ హౌస్, ప్రభుత్వ కాలేజ్, పట్టు పరిశ్రమ, పోలీసు క్వార్టర్స్ అన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో ఏపీలో ఉన్న ప్రజలు భయపడుతున్నారన్నారు. జగన్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరంటూ మాజీ ఎంపీ వ్యాఖ్యలు చేశారు.
CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌కు సీబీఐ షాక్..
జగన్‌లో మార్పు కనిపిస్తోంది...
విజయవాడలో ప్రధాని మోదీ (PM Modi), కూటమి నేతల ర్యాలీ చూస్తే గెలుపు ఖాయం అయినట్టుందన్నారు. వైసీపీని ఇంటికి పంపించాలని ప్రజలు ఫిక్స్ అయ్యారన్నారు. వై నాట్ 175 నుంచి జగన్ ఎన్నికలు జరుగుతాయో? లేదో? అనే ఆలోచనలకు వచ్చారన్నారు. మార్పు సహజమని జగన్‌లో మార్పు కనిపిస్తోందన్నారు. జగన్‌లో ఉన్న అహకరం, ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. అన్నమయ్య డ్యామ్ ఫెయిల్యూర్‌తో 50 మంది, పెన్షన్ దెబ్బకు మరికొంత మంది చనిపోయారన్నారు. ప్రధాని రాష్ట్రంలో మాఫియా నడుస్తోందని.. ఎన్డీఏ వచ్చిన తర్వాత చర్యలు తప్పవు అన్నారని తెలిపారు. ఏపీలో ప్రజలకు అవసరమైన ఏ స్కీమ్ అందలేదనిని ప్రధానికి అర్థమైందని కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్
AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?
Read Latest AP News And Telugu News
Updated Date - May 09 , 2024 | 01:25 PM