Kanakamedala: పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..
ABN, Publish Date - May 06 , 2024 | 02:16 PM
Andhrapradesh: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, మే 6: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Former MP Kanakamedala Ravindra Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసంఇంతమందిని బలి చేశారన్నారు. ఉద్యోగులు ఓటు కూడా వినియోగించుకొలేని పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగులు 95 శాతం ఎన్డీయే కూటమికి ఓట్లు వేసే వారే అని తెలిపారు.
Bhatti Vikramarka: షెడ్ నుంచి కారు ఇక బయటకు రాదంతే.. బీఆర్‌ఎస్‌పై భట్టి కామెంట్స్
జగన్‌ను ఇంటికి పంపేందుకు ఉద్యోగుల సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెడుతున్నారో అర్థమైందన్నారు. రాష్ట్రంలో కొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న. గతంలో రాజశేఖర్ రెడ్డికి సహకరించిన కొందరు ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరగడం చూశాము. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారులు అడ్డగోలుగా పని చేశారు’’ అంటూ మాజీ ఎంపీ విమర్శించారు.
AP Elections: నెక్స్ట్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!!
సీఎస్ రాజీనామా చేయాల్సిందే...
డీజీపీని ఎన్నికల నిర్వహణ నుంచి పక్కకు తప్పించారన్నారు. వైసీపీ కోసం కొందరు అధికారులు అధికార దుర్వినియోగం చేశారని అనడానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజలు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేలా చేయాలని తెలిపారు. అధికారులు ప్రలోభాలకు గురి అవ్వొద్దని కోరారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులకు స్వేచ్చ, గౌరవం ఉండేదని.. జగన్ లాగా చంద్రబాబు అధికారులను ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. చీఫ్ సెక్రటరీ పెన్షనర్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. పెన్షనర్ల మరణాలకు చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత వహించాలన్నారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ సమయానికి స్పందించి చీఫ్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పియాలన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాధితుడేనని వాపోయారని కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు
CP Srinivareddy: హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్
Read Latest AP News And Telugu news
Updated Date - May 06 , 2024 | 02:45 PM