Kanakamedala Ravindra: జగన్‌కు సంక్షేమం తెలియదు.. రాష్ట్రాన్ని దోచేశారు
ABN, Publish Date - Apr 29 , 2024 | 01:40 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని అంటున్నారని.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అంటూ మాజీ ఎంపీ సూటిగా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (Former MP Kanakamedala Ravindra Kumar) తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో (Manifesto) చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని అంటున్నారని.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అంటూ మాజీ ఎంపీ సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు పెట్టి జగన్ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
AP Election 2024: పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు: చంద్రబాబు
25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారని.. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతామని అన్నారని.. అది ఏమైందని... ఎవరు ఎవరి దగ్గర మెడలు వంచారని నిలదీశారు. జగన్ మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. మద్యపాన నిషేధం అన్నారు ఏమైందని మరో ప్రశ్న వేశారు. కల్తీమద్యం సరఫరా చేస్తున్నారని.. అనేకమంది చనిపోయారన్నారు. మద్యం తయారీ సీఎం బంధువులకు ఇచ్చారని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమైందని అడిగారు. జగన్ గతంలో ఇచ్చిన హామీలే విఫలం అయ్యాయని.. ప్రజలను జగన్ నయవంచనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
AP Elections: ఇది నా ఆస్తని మనం రుజువు చేసుకోవాలా?.. జగన్‌పై మండిపడ్డ పవన్
కరెంట్ రేట్లు 9 సార్లు పెంచారన్నారు. అన్నా క్యాంటీన్ ఎత్తేశారని.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తగ్గించారన్నారు. సంపద సృష్టికి ఏమైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారని వివరించారు. వాస్తవాలకు భిన్నంగా జగన్ పచ్చి అబ్దాలు మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడం, మద్యపానం నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అని జగన్ అన్నారని గుర్తుచేశారు. జగన్ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో మళ్ళీ వచ్చారన్నారు. జగన్‌కు సంక్షేమం తెలియదని.. రాష్ట్రాన్ని దోచేశారని కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?
LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 29 , 2024 | 01:50 PM