ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Betting: జోష్ నింపిన ఎగ్జిట్ పోల్ అంచనాలు

ABN, Publish Date - Jun 02 , 2024 | 10:43 AM

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్‌లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.

gudivada and gannavaram

అమరావతి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్‌లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ట్రెండ్ తెలియడంతో ప్రత్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. బెట్టింగ్ కాసేందుకు ముందుకు రావడం లేదు.


విదేశాల్లో కూడా..

కూటమి విజయం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా బెట్టింగ్ చేస్తున్నారు. కూటమికి మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపడంతో రెండు రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ముందుకు రావడం లేదట. గతంలో కట్టిన పందేల డబ్బులను తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి అలా డబ్బులు తిరిగి ఇవ్వరు. 10 శాతం నగదు వదిలేసుకొని మరి తీసుకుంటున్నారని తెలిసింది.


గుడివాడ, గన్నవరం

ఆంధ్రప్రదేశ్‌లో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. గుడివాడలో వైసీపీ నుంచి మాజీమంత్రి కొడాలి నాని బరిలో ఉన్నారు. అతనిపై వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. ఓటమి ఖాయమని క్షేత్రస్థాయిలో జనం చర్చించుకుంటున్నారు. కొడాలి నాని వాడే భాషపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడివాడ నుంచి నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2019లో వరసగా రెండుసార్లు విక్టరీ కొట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోయారు.


రెండుసార్లు గెలిచిన వంశీ

గన్నవరం నుంచి వంశీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగారు.


రాము, వెంకట్రావు

గుడివాడలో తెలుగుదేశం పార్టీ నుంచి వెనిగండ్ల రాము బరిలో ఉన్నారు. నానిపై ఉన్న వ్యతిరేకతను రాము క్యాష్ చేసుకున్నారని విశ్లేషిస్తారు. దాంతో గుడివాడలో కూటమి అభ్యర్థి విజయం ఖాయం అనే ధీమాతో బెట్టింగ్ రాయుళ్లు ఉన్నారు. పోటా పోటీగా పందేలు కాస్తున్నారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఇక్కడ వెంకట్రావు వైపు జనం మొగ్గుచూపారని తెలిసింది. అందుకే గుడివాడ, గన్నవరంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని జోరుగా బెట్టింగ్ చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 10:43 AM

Advertising
Advertising