AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?
ABN, Publish Date - May 24 , 2024 | 04:39 PM
ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజున రాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా భారీగా పెరిగాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజున రాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు (Postal Ballot Vote) కూడా భారీగా పెరిగాయి. దీంతో జనం తీర్పు ఏ విధంగా ఉండనుందో అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.
పోస్టల్ బ్యాలెట్
ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 38 వేల 865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. తర్వాత స్థానంలో నంద్యాల జిల్లా ఉంది. ఇక్కడ 25 వేల 283 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేశారు. మూడో స్థానంలో కడప జిల్లా నిలిచింది. ఇక్కడ 24 వేల 918 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. అత్యల్పంగా నరసాపురంలో 15 వేల 320 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి.
ఈసీ సమాచారం..?
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వివరాలు జిల్లాల వారీగా వచ్చాయి. దాంతో జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి..? ఒక్కో టేబుల్‌లో ఎన్ని లెక్కించాలని అనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమీషన్ సమాచారం ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేకున్నా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని తెలుగుదేశం పార్టీ కోరింది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా మౌఖికంగా అంగీకారం తెలిపారు. దానికి సంబంధించి లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరింది.
పరిగణలోకి తీసుకోండి
డిక్లరేషన్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాలని కోరుతుంది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమీషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా నమోదవడంతో అధికార వైసీపీలో కలవరం మొదలైంది. ఆ ఓట్లు తమకు మైనస్ అవుతుందని సందేహిస్తోంది. గతంలో కంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువుగా నమోదయ్యాయి.
Read Latest APNews and Telugu News
Updated Date - May 24 , 2024 | 05:41 PM