AP Elections: వైసీపీకి ధీటుగా టీడీపీ మేనిఫెస్టో.. ఆ రెండింటికి టాప్ ప్రయారిటీ..!?
ABN, Publish Date - Apr 27 , 2024 | 04:14 PM
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పార్టీలు ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోలను విడుదలచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ సైతం పూర్తిస్థాయి మేనిఫెస్టోను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పార్టీలు ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోలను విడుదలచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ సైతం పూర్తిస్థాయి మేనిఫెస్టోను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓట్ల కోసం సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసినప్పటికీ.. అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో విఫలమైందనే ప్రచారం జరుగుతోంది.
అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతలు కల్పన, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి నిర్థిష్టంగా పొందుపర్చలేదు. దీంతో ఇది కేవలం ఓట్లను దండుకుని.. రాష్ట్రాన్ని అప్పులమయం చేసే మేనిఫెస్టోగా ఉందనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సంపదను పెంచకుండా.. కేవలం అప్పులతో సంక్షేమ పథకాలు అమలుచేస్తే రాష్ట్రం దివాళాతీసే పరిస్థితికి వస్తుందని ఎంతోమంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. వైసీపీ మాత్రం ఉచితాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్‌తో తన మేనిఫెస్టో, అధికారంలోకి వస్తే తమ ప్రాధాన్యతలు ఏమిటో చెప్పకనే చెప్పింది.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
ఆదాయం పెంపుపై టీడీపీ ఫోకస్..
ఏపీలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా.. సంపదను పంపిణీ చేయడంపై వైసీపీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ మాత్రం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిందని చెప్పుకోవచ్చే. సూపర్ సిక్స్‌లో పూర్ టు రిచ్ అని ఇచ్చిన హామీతోనే తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుంది. పేదరికంలో ఉన్న వాళ్లకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు.. వారి ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టిసారిస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు కేవలం ఉచిత పథకాలను ఇస్తూ.. వారి ఆదాయాన్ని పెంచకపోతే ఆ కుటుంబం జీవితాంతం పేదరికంలోనే ఉండిపోవల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో పేద ప్రజల స్థితిగతులను మారుస్తూ.. వారి ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టడంతో పాటు.. పేద పిల్లల విద్యకు ఆర్థిక సాయం, రైతులకు పెట్టుబడి సాయం, మహిళ సాధికారితకు అవసరమైన సహాయం అందిచడంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాజిక భద్రత ఫించన్లు పెంచుతామని టీడీపీ చెబుతోంది.
మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు.. పరిశ్రమలు వచ్చేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వైసీపీ మేనిఫెస్టోలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఊసే లేదు. దీంతో టీడీపీ పూర్తిస్థాయి మేనిఫెస్టో మరితం ప్రజాకర్షణీయంగా ఉండనుందనే చర్చ జరుగుతోంది.
సంక్షేమం.. అభివృద్ధి..
ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో టీడీపీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలను ఈ మేనిఫెస్టో ఆకర్షించడంతో పాటు.. ఎవరితో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వాన్ని నడిపించడంతో ఎంతో పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండటంతో రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వైసీపీతో పోల్చినప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో అంశాలు అమలయ్యే అవకాశం ఉందనే విశ్వాసం ప్రజల్లో కలుగే అవకాశం ఉంది.
YSRCP Manifesto 2024: మళ్లీ గెలిస్తే.. అమ్మ ఒడి పెంపు: సీఎం జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telugu News Here
Updated Date - Apr 27 , 2024 | 04:37 PM