మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీ గెలుపు తథ్యం.. మంత్రి రోజా ధీమా

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:26 PM

ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. విజయం తమదేనని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని తేల్చి చెబుతున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా చేరారు.

AP Elections: వైసీపీ గెలుపు తథ్యం.. మంత్రి రోజా ధీమా
minister rk roja

తిరుమల: ఏపీలో ఎన్డీయే కూటమిదే అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే తామే గెలవబోతున్నామంటూ వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని అంటున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) కూడా చేరిపోయారు. ఈ రోజు మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.


వైసీపీకి పట్టం..?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి రోజా వివరించారు. జనం మరోసారి వైసీపీకి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయంపై కొందరు నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబట్టారని ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా ఆపలేరో.. అదేవిధంగా వైసీపీ గెలుపును ఆపలేరని రోజా స్పష్టం చేశారు.


ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధం లేదు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదని మంత్రి రోజా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారం చేపట్టడం ఖాయం అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 01:31 PM

Advertising
Advertising