ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే.. ఈవీఎంలు ధ్వంసం

ABN, Publish Date - May 21 , 2024 | 09:21 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ (మే -13), ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతునే ఉన్నారు.

MLA Pinnelli Ramakrishna Reddy

పల్నాడు జిల్లా: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ (మే -13), ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతునే ఉన్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. పోలీసులు కూడా వారికి అడ్డుచెప్పకపోవడంతో మాచర్లలో హింసకు పాల్పడ్డారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజున స్వయంగా ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేశారు.


ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి

పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనను ఎన్నికల కమిషన్, పోలీసులు సీరియస్‌గా తీసుకొని పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా.. ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అల్లర్లు జరుగుతుంటే కట్టడి చేయకుండా ఉన్న అధికారులపై కూడా ఈసీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై కూడా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిన్నెల్లిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలికా.


ఈ వార్తలు కూడా చదవండి..

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

DGP Harish kumar: వారికి సీఆర్పీసీ 41 నోటిసులిచ్చాం.. కఠిన చర్యలు తీసుకుంటాం

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 09:48 PM

Advertising
Advertising