AP Election 2024: జగ్గూ భాయ్.. నీకు ఇంకా అర్థం కాలేదా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - May 06 , 2024 | 07:34 PM
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
అనకాపల్లి: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
ఈ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా జగన్ పనైపోయిందని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా ఇచ్చారని అన్నారు. రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని చెప్పుకొచ్చారు. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో.. మోదీ, అమిత్‌షా చెప్పారని అన్నారు.‘‘జగ్గూ భాయ్ నీ బాబాయ్ (మాజీ మంత్రి వివేకానందారెడ్డిని) ఎవరు చంపారో.. ఇంకా అర్థం కాలేదా’’ అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు
సోమవారం అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాగళం వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో విశాఖ వచ్చినప్పుడు పవన్‌ను అడ్డుకున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అవమానించి.. వ్యక్తిగత విమర్శలు చేశారని విరుచుకుపడ్డారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని తెలిపారు. నిజజీవితంలోనూ పవన్‌కల్యాణ్ హీరోనేనని కొనియాడారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని పవన్ చెప్పారన్నారు.
Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ
2047లో వికసిత్ భారత్.. మోదీ లక్ష్యమన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్.. తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మనకు మోదీ గ్యారెంటీ.. సూపర్ సిక్స్ ఉన్నాయని ఉద్ఘాటించారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం వస్తే ప్రొక్లెయిన్లు వస్తాయని.. పోలీసులు గోడలు దూకుతారని ధ్వజమెత్తారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మా కలయిక.. అమరావతి నిర్మాణం కోసమని తెలిపారు. మా కలయిక.. తెలుగు భాషను కాపాడుకునేందుకేనని చెప్పారు.మా కలయిక.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేసేందుకేనని తెలిపారు. మీ భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ
Updated Date - May 06 , 2024 | 07:45 PM