ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: జగన్‌కి స్టార్టప్ అంటే తెలియదు.. నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - May 01 , 2024 | 07:08 PM

సీఎం జగన్‌కి (CM Jagan) స్టార్టప్ అంటే తెలియదని.. ఆయనకి తెలిసింది ఒక్కటేనని దోచుకో... దాచుకోవడమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. ఆర్థిక వనరులు పెంచుతామని హామీ ఇచ్చారు. కియా కంపెనీతో అనంతపురం జిల్లా ప్రజల జీవన‌ ప్రమాణాలు పెరిగాయని తెలిపారు

Nara Lokesh

నెల్లూరు: సీఎం జగన్‌కి (CM Jagan) స్టార్టప్ అంటే తెలియదని.. ఆయనకి తెలిసింది ఒక్కటేనని దోచుకో... దాచుకోవడమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. ఆర్థిక వనరులు పెంచుతామని హామీ ఇచ్చారు. కియా కంపెనీతో అనంతపురం జిల్లా ప్రజల జీవన‌ ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. అప్పులు చేసి సంక్షేమం చేపడితే శ్రీలంక వంటి దేశాల పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు.


Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

యువగళంలో భాగంగా బుధవారం నెల్లూరులో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

జగన్ ప్రభుత్వం రూ.12లక్షల కొట్ల అప్పు ప్రజలపై మోపిందని మండిపడ్డారు. 2019 ముందు తనపై ఒక్క కేసు లేదని, పోలీసుస్టేషన్లకి వెళ్లలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో తనపై 23 కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులూ మోపారని చెప్పారు. తనపైనే కాదని.. అమాయకులపై చాలా అక్రమ కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే సమాజం భయపడిందన్నారు.


చట్టాలు ఉల్లంఘించిన అధికారులను ఎవరినీ వదిలేదు‌ లేదని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రోజు తప్పు చేయలేదని.. 53 రోజులు జైల్లో‌ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో స్కిల్ డెవల్మెంట్ కొనసాగిస్తామని మాటిచ్చారు. నెల్లూరుకి సాఫ్ట్‌వేర్‌తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలూ తీసుకువస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 07:12 PM

Advertising
Advertising