ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: జనసైనికులకు పవన్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Apr 03 , 2024 | 05:46 PM

వైసీపీ కుట్రలను తిప్పకొట్టేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి పెన్షన్లు అందించకుండా.. మండు టెండలో వృద్ధులు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

వైసీపీ కుట్రలను తిప్పకొట్టేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawankalyan) జనసైనికులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి పెన్షన్లు అందించకుండా.. మండుటెండలో వృద్ధులు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులకు జనసైనికులు తోడుగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


ఫించన్లు తీసుకోవల్సిన వృద్ధులు, దివ్యాంగులను గ్రామ, వార్డు సచివాలయాలకు జనసైనికులు తమ వాహనాల్లో తీసుకెళ్లాలని ఆదేశించారు. వారికి ఫించను ఇప్పించి.. తరువాత వాళ్ల ఇంటి దగ్గర దించి రావాలని సూచించారు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించాలన్నారు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.

AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ


ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్లి ఫించన్ ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రభుత్వ అధికారులు కావాలనే సచివాలయంలో మాత్రమే పెన్షన్లు ఇస్తామని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జనసైనికులు పెన్షన్ తీసుకునేవారికి ధైర్యంగా, తోడుగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 05:46 PM

Advertising
Advertising