ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. తేదీలు ఇవే!

ABN, Publish Date - May 03 , 2024 | 05:08 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 6, 8 తేదీలలో ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు.

PM Modi Election Campaign in AP

అమరావతి, మే 3: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎన్నికల ప్రచార (Election CAmpaign) షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 6, 8 తేదీలలో ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), పవన్ కళ్యాణ్‌ల (Janasena Chief Pawan Kalyan) ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వేమగిరి చేరుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల సభలో పాల్గొంటారు. 6వ తేదీ సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు ప్రధాని వెళ్లనున్నారు. సాయంత్రం 5 :55 గంటలకు అనకాపల్లి చేరుకొని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు (BJP MP Candidate CM Ramesh) మద్దతుగా మోదీ ప్రచారం చేస్తారు. ఈ సభలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రసంగించనున్నారు.

TS Politics: సీఎం రేవంత్‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు


అలాగే ఈనెల 8వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి మోదీ చేరుకుంటారు. పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి సభ ప్రాంగణం వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు రానున్న ప్రధాని.. రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి, ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మోదీ సభళో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సభలో పాల్గొననున్నారు. 8న సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు మోదీ రానున్నారు. ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రోడ్ షోలో పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ముద్రగడ విషయంలో ఇలా అయ్యిందేంటి.. వైసీపీలో అంతర్మథనం!!

Viral: రోజూ అదే ట్రెయిన్ కోసం ప్లాట్‌ఫామ్‌పై వేచి చూసే కుక్కు.. అసలు కథేంటో తెలిస్తే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 05:12 PM

Advertising
Advertising