ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: టీడీపీపై వైసీపీ కార్యకర్తల దాడి ఘటనలో పోలీసుల వైఖరి చూస్తే..

ABN, Publish Date - May 08 , 2024 | 04:00 PM

Andhrapradesh: జిల్లాలోని నల్లజర్లలో నిన్న (మంగళవారం) రాత్రి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వైసీపీ నేతలపై కాకుండా టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపురం టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో పాటు పలువురుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.

Police case against TDP Actvists

తూర్పుగోదావరి, మే 8: జిల్లాలోని నల్లజర్లలో నిన్న (మంగళవారం) రాత్రి టీడీపీ కార్యకర్తలపై (TDP Actvists) వైసీపీ కార్యకర్తల దాడి కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వైసీపీ నేతలపై కాకుండా టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపురం టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో పాటు పలువురుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది. పోలీసులు వైఖరిని టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు (TDP Candidate Maddipati Venkataraju), జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీవ్రంగా ఖండించారు.

AP Elections: ఇద్దరి నినాదం ఒకటే.. చేతులు కలిపిన కేసీఆర్, జగన్..


మద్దిపాటి మాట్లాడుతూ.. ఒక దళితుడైన తనపై నల్లజర్ల పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు హాస్యాస్పదమన్నారు. దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని దళితులపైనే ప్రయోగిస్తారా అంటూ మండిపడ్డారు. తమకు న్యాయం చేయమని పోలీసులను అడిగితే తిరిగి తమపైనే అట్రాసిటీ కేసు, మర్డర్ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని పరిరక్షించవలసిన పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా హోంమంత్రికి వత్తాసు పలకడం దారుణమన్నారు. పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని.. న్యాయ పోరాటం చేస్తామని మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు.

AP Elections: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే..?


ఏం జరిగిందంటే?...

తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో గత అర్ధరాత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత మోటార్ సైకిల్‌తో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రామకృష్ణ అనే టీడీపీ నాయకుడి తలకు తీవ్ర గాయమైంది. రామకృష్ణను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నల్లజర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


ఇవి కూడా చదవండి...

AP Elections: ముద్రగడ మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!

PM Modi: శరీరం రంగు చూపి ప్రజలను అవమానిస్తారా?.. శామ్ పిట్రోడాపై మోదీ నిప్పులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 04:00 PM

Advertising
Advertising