ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మంత్రి కాకాణి ఇలాకాలో భారీగా మద్యం డంప్... అధికారులు వెళ్లి చూడగా..!

ABN, Publish Date - Apr 20 , 2024 | 04:56 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉంది. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్స్ చేస్తున్నారు. మద్యం తరలింపులపై పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు...

SEB seizes 500 liquor bottles

నెల్లూరు, ఏప్రిల్ 20: ఏపీలో ఎన్నికలకు (AP Elections) మరో 20 రోజులే సమయం ఉంది. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్స్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు పెట్టి మద్యం తరలింపులపై చెక్ పెట్టేలా చేస్తున్నప్పటికీ ఏదో రకంగా ఆల్కాహాల్, డబ్బులు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు సదరు నేతలు. ఇక తాజాగా ఓ మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో పెద్దఎత్తున డంప్ బయటపడింది.

AP Elections: వైసీపీకి ఓటమి భయం.. ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్!


ఇదీ విషయం...

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (AP Minister Kakani Govardhan Reddy)ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి. వెంకటాచలంలో భారీ డంప్ ఉన్నట్లుగా అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే సమాచారం అందిన వెంటనే సెబ్‌ అధికారులు రాకపోవడంతో జరగాల్సిది జరిగిపోయింది. డంప్‌పై ఇన్ఫాం చేసిన నాలుగు గంటల తర్వాత సెబ్ అధికారులు అక్కడికు వచ్చి దాడులు మొదలుపెట్టారు. ఈ గ్యాప్‌లోనే వైసీపీ శ్రేణులు తమ చేతులకు పనిచెప్పేశారు.

TG Politics: నన్ను టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్


డంప్‌పై సెబ్ అధికారులకు సమాచారం అందిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు.. డంప్ నుంచి మద్యం సీసాలను బస్తాల్లోకి వేసి పలు ప్రాంతాలకు చేరవేశారు. ఈ క్రమంలో డమ్మాయపాళెం - పంటపాళెం రోడ్డులో వైసీపీ నేత మారు సుధాకర్ రెడ్డికి చెందిన కారులో మద్యం సీసాలు అక్రమంగా రవాణా చేశారు. ఈ విషయం తెలిసిన సెబ్ అధికారులు కారును వెంబడించారు. దీంతో భయాందోళనకు గురైన డ్రైవర్ కారును ఓ పరిశ్రమ వద్ద నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు వద్దకు చేరుకున్న అధికారులకు.. అందులో ఆరు బస్తాల్లో సుమారు 500కు పైగా మద్యం సీసాలను గుర్తించారు. మద్యం సీసాలతో సహా కారును సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన క్యాచ్.. రవీంద్ర జడేజా గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ చూడండి..!

Atchannaidu: గులకరాయి డ్రామా దర్శకత్వం వహించనవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న ఎద్దేవా

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 05:12 PM

Advertising
Advertising