ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: తెనాలిలో ఓటర్‌ను ఎమ్మెల్యే కొట్టడంపై దీపక్ మిశ్రా ఆగ్రహం

ABN, Publish Date - May 13 , 2024 | 01:59 PM

Andhrapradesh: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో ఓటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్‌ మిశ్రా స్పందించారు. ఓటర్‌పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్‌లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని దీపక్ మిశ్రా ఆదేశించారు.

Tenali Incident

అమరావతి, మే 13: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో ఓటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే (YSRCP MLA) చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్‌ మిశ్రా (Special Police Observer Deepak Mishra) స్పందించారు. ఓటర్‌పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్‌లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని ఆయన ఆదేశించారు.

AP Elections 2024: తిక్క కుదిరింది.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన ఓటర్..


ఏపీ వ్యాప్తంగా పోలింగ్ సరళిని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని దీపక్‌ మిశ్రాకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎంకే మీనా వివరించారు. హింసాత్మక ఘటనలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. 42 వేల సీసీ కెమెరాలు పెట్టినా హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలు జరిగిన మరో ఐదు ప్రాంతాల్లోని పరిస్థితి నివేదికవ్వాలని దీపక్ మిశ్రా ఆదేశాలు జారీ చేసింది.

Revanth Reddy: ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధానినో తేల్చుకోండి..


అసలేం జరిగిందంటే..

కాగా... ఓటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకోవడంలో గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ (Tenali YCP MLA candidate Annabathuni Shivakumar) క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆయన్ని గమనించిన ఓ ఓటర్ లైన్లో నిల్చొని ఓటు వేయాలని సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు ఎమ్మెల్యే.. ప్రశ్నించిన ఓటరుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చంపపగులగొట్టాడు. దీంతో రెచ్చినపోయిన ఎమ్మెల్యే అనుచరులు.. ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనతో పోలింగ్ బూత్‌లో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. కాసేపు పోలింగ్ కూడా నిలిచిపోయింది. వెంటనే పోలీసుల జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది. అయితే వైసీపీ నేతల తీరుపట్ల ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..

Elections 2024: ఓటరులో చైతన్యం నింపిన ఆంధ్రజ్యోతి.. పోలింగ్ కేంద్రాలకు క్యూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2024 | 02:02 PM

Advertising
Advertising