AP Elections: అదనపు బస్సులు ఏర్పాటు చేయండి.. ఆర్టీసీ ఎండీకీ చంద్రబాబు లేఖ
ABN, Publish Date - May 11 , 2024 | 02:35 PM
Andhrapradesh: మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మే 13వ తేదీన పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు.
అమరావతి, మే 11: మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) స్పందించారు. మే 13వ తేదీన పోలింగ్‌కు (AP Elections 2024) వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని టీడీపీ చీఫ్ అభిప్రాయపడ్డారు.
Elections 2024: పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!
లేఖలోని అంశాలు ఇవే..
13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు.
ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు.
ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్ లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది.
అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారు.
ఈ రెండు మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి.
రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!
Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..
Read Latest AP News And Telugu News
Updated Date - May 11 , 2024 | 02:50 PM