Atchannaidu: గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ కుట్ర..
ABN, Publish Date - Apr 17 , 2024 | 12:17 PM
Andhrapradesh: సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాలు చేశారని.. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు.
అమరావతి, ఏప్రిల్ 17: సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి (CM Jaganreddy) కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో కోడికత్తి (Kodi kathi drama) డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాలు చేశారని.. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు. కిరాయి ఇస్తామని తీసుకెళ్లారని, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని... కడుపులో మండి గులకరాయి విసిరాడని సదరు వ్యక్తి చెప్పాడని... దీనికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. టీడీపీపై నెట్టడానికి సిగ్గనిపించటం లేదా అంటూ విరుచుకుపడ్డారు.
Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు
కోడికత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారని గుర్తుచేశారు. ‘‘ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే, బాధ్యత వహించాల్సింది మీరే’’ అని పేర్కొన్నారు. చిన్న గులకరాయి తగిలితే ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలకు బదులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే దేశం గర్వించే మంచి నటుడు అయ్యేవారన్నారు. 24 క్లెమోర్ బాంబులు పేలి 15 అడుగుల మేర ఎగిరి పడిన వ్యక్తి కూడా ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదని చెప్పుకొచ్చారు. కానీ, గులకరాయి తగిలితే సానుభూతి డ్రామాలు ఆడటానికి సిగ్గనిపించడం లేదా అని నిలదీశారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
KCR: బాబోయ్.. కేసీఆర్ ఇంటివద్ద క్షుద్ర పూజలు..!
Chandrababu: అందరికీ నవమి శుభాకాంక్షలు.. ప్రజల ఆనందమే ముఖ్యమని చెబుతోంది రామకథ..
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 17 , 2024 | 12:27 PM