ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kanaparthi Srinivas: చంద్రబాబుది ప్రాణం కాదా?

ABN, Publish Date - Apr 17 , 2024 | 10:40 AM

Andhrapradesh: జాతీయ భద్రతా దళాల రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ప్రాణం కాదా ? అని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆయనపై అనేకసార్లు రాళ్ళ దాడి జరగటమేకాక, ఆయనకు రక్షణగా ఉన్న సీఎస్ఓ, ఎన్ఎస్జీ గార్డుల తల పగిలి కుట్లు పడినా సెక్షన్ 307 కింద కేసులు ఎందుకు నమోదు చేయలేదో పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

TDP Leader Kanaparthi Srinivasarao About Stone Attack Issue

గుంటూరు, ఏప్రిల్ 17: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై (CM YS Jaganmohan Reddy) జరిగిన గులకరాయి దాడిపై వైసీపీ నేతలు ఎంతటి రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. గత శనివారం విజయవాడ సింగ్‌నగర్‌లో ‘‘మేమంతా సిద్ధం’’ బస్సులో యాత్ర సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఆగంతకులు గులకరాయితో దాడి చేశారు. దీంతో సీఎం జగన్ కన్నుపై గాయమవగా... పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌‌కు మరో రాయి తగిలి కన్నుకు గాయమైంది. ఇదిలా ఉండగా.. గులకరాయి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. సీఎంపై దాడి వెనక కుట్ర కోణం ఉందని, పథకం ప్రకారమే దాడి చేశారంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా జగన్‌కు ఎన్‌ఎస్‌జీ రక్షణ కావాలంటూ కేంద్రాన్ని కూడా అభ్యర్థించింది వైసీపీ.

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!


ఎంతటి సిగ్గు చేటు...

అయితే జగన్‌పై జరిగిన తర్వాతి రోజు వేర్వే చోటు టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) రాళ్లతో దాడికి ఒడిగట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ అంశాన్ని టీడీపీ, జనసేన నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. రాళ్ల దాడులు జరిగినప్పటికీ కేసులు నమోదు చేయకపోవడం పట్ల తెలుగుదేశం శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికారపార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. జాతీయ భద్రతా దళాల రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ప్రాణం కాదా ? అని ప్రశ్నించారు.

Israel Vs Iran War: ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం!


ఆయనపై అనేకసార్లు రాళ్ళ దాడి జరగటమేకాక, ఆయనకు రక్షణగా ఉన్న సీఎస్ఓ, ఎన్ఎస్జీ గార్డుల తల పగిలి కుట్లు పడినా సెక్షన్ 307 కింద కేసులు ఎందుకు నమోదు చేయలేదో పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, రాయి డ్రామాని సాకుగా చూపించి జగన్ రెడ్డి లాంటి నేరస్తుడికి ఎన్‌ఎస్‌జీ రక్షణ కావాలని వైసీపీ నేతలు కేంద్రాన్ని అభ్యర్ధించటం సిగ్గుచేటు అంటూ కనపర్తి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: జగన్‌.. ఇక నీ ఆటలు సాగవు.. బాలయ్య మాస్ వార్నింగ్..

AP Politics: అర్ధరాత్రి పోలీసుల జులుం.. టీడీపీ కార్యకర్త ఇంట్లోకి దూరి..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 17 , 2024 | 10:47 AM

Advertising
Advertising