AP Elections 2024:ఆయన ఉంది వైసీపీ పార్టీలో.. కానీ నిత్యం టీడీపీ జపమే: వర్లరామయ్య
ABN, Publish Date - May 20 , 2024 | 06:46 PM
సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అమరావతి: సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాకు చెందిన రామాల మన్విత్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా కొన్ని రోజులుగా తమ పార్టీ ముసుగు వేసుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.
వైసీపీ నాయకుడు మన్విత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని మాట్లాడుతున్నారని.. ఆయన ఉన్నది వైసీపీ పార్టీలో... కానీ వేషం వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీదని ఎద్దేవా చేశారు.
జగన్ మోహన్ రెడ్డి మీ పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తమ నేతలపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే మన్విత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్‌లో జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఇష్టానుసారంగా టీడీపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.సీఐడీ అధికారులకు సాక్షాధారాలతో మొత్తం వివరించామని వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రామాల మన్విత్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తామని సీఐడీ డీజీ హామీ ఇచ్చారని వర్లరామయ్య పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!
జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 20 , 2024 | 06:58 PM