మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే.. పాట విడుదల చేసిన టీడీపీ

ABN, Publish Date - Mar 21 , 2024 | 05:54 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసే పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఆ పాటను సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే రాముని తీరు.. శ్రీరాముని తీరు అని పాట స్టార్ట్ అవుతోంది.

TDP: సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే.. పాట విడుదల చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసే పాటను తెలుగుదేశం పార్టీ (TDP) విడుదల చేసింది. ఆ పాటను సోషల్ మీడియా ఫేస్ బుక్ (Facebook), ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే రాముని తీరు.. శ్రీరాముని తీరు అని పాట స్టార్ట్ అవుతోంది. సమరం చేద్దాం అంటూ సైన్యం కదిలి వచ్చే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు. ఒక ఉద్యమం పుట్టింది సీమాంధ్రుల కోసం, రాక్షస పాలనకు చేస్తాం రా అంతం. మీ కత్తులకు మా నెత్తురు తల వంచదు. ధూం ధాం దుంకి ఆడతాం. దుమ్ము లేస్తుంటే పసుపు జెండా ఎగరేస్తాం. ధూం ధాం దుంకి ఆడతాం జన గర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అని రొమ్ములు నిక్కబొలిచేలా పాట ఉంది. రౌడీయిజానికి పౌరుషానికి మొదలైన యుద్దం.. గెలుపెవరిదో చూద్దాం అంటూ కార్యకర్తలకు భరోసా నిస్తూ సాగింది. జగన్ నిన్ను తరిమి కొట్టేందుకు ప్రతి ఆంధ్రుడు కదిలాడు అనే పదాలతో యువతలో జోష్ నింపారు. 3.31 నిమిషాలు ఉన్న పాటను సుధీర్ కట్ట ప్రెజెంట్ చేశారు. ఆ పాటను మీరు వినండి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 05:54 PM

Advertising
Advertising