AP Elections: జేసీబీలతో యార్లగడ్డకు స్వాగతం
ABN, Publish Date - May 04 , 2024 | 08:10 AM
గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు నేతలంతా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గన్నవరం నియోజకవర్గం అభివృద్ది చేయడం తన ముఖ్య ఉద్దేశం అని వివరించారు.
గన్నవరం నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తీసుకొస్తానని యార్లగడ్డ ప్రకటించారు. నియోజకవర్గంలో ఉండే యువతకు మెరుగైన ఉపాధి లభిస్తోందని అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కక్షసాధింపు చర్యలకు పాల్పడనని స్పష్టం చేశారు. గతంలో వైసీపీలో 5 నెలలు ఇంచార్జీగా ఉన్నప్పటికీ వ్యక్తులను లక్ష్యం చేసుకోలేదని వివరించారు. కేసుల పెట్టి వేధించేందుకు రాజకీయాల్లోకి రాలేదని తేల్చి చెప్పారు. వైసీపీని వీడిన తర్వాత తనపై కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తెగేసి చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించి, సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని యార్లగడ్డ వివరించారు.
Read Latest AP News And Telugu News
Updated Date - May 04 , 2024 | 09:41 AM