TDP: టీడీపీలో కొత్తతరం ఫైర్ బ్రాండ్.. వరుణ్ కుమార్
ABN, Publish Date - Apr 22 , 2024 | 09:47 PM
ఏపీలోని ఐదేళ్ల వైఎస్సార్సీపీ (YSRCP) అరాచకపాలనపై ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో తెలుగు యువత ముందు వరుసలో ఉంటుంది. అధికార పార్టీ దాడులకు, పోలీస్ కేసులకు వెరవకుండా తనదైన పోరాట పటిమతో అవిశ్రాంత పోరు నడిపింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అందించిన ప్రోత్సాహం తెలుగు యువతలో కొత్తతరాన్ని తీర్చిదిద్దింది.
AP Election 2024: ఏపీలోని ఐదేళ్ల వైఎస్సార్సీపీ (YSRCP) అరాచకపాలనపై ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో తెలుగు యువత ముందు వరుసలో ఉంటుంది. అధికార పార్టీ దాడులకు, పోలీస్ కేసులకు వెరవకుండా తనదైన పోరాట పటిమతో అవిశ్రాంత పోరు నడిపింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అందించిన ప్రోత్సాహం తెలుగు యువతలో కొత్తతరాన్ని తీర్చిదిద్దింది.
చిత్తూరు నియోజకవర్గానికి చెందిన వరుణ్ కుమార్ (Varun kumar) దీనికి ప్రత్యేక నిదర్శనం. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మంచి వక్తగా, పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా స్వల్ప కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. గత మహానాడులో తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, అద్భుతమైన ప్రసంగంతో అధినేత చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు.
Chandrababu: వైసీపీ అక్రమాలను అణిచేద్దాం... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
అంతేగాక రాష్ట్రంలో జే బ్రాండ్(J Brand) కల్తీ మద్యం గురించి బయటపెట్టడంలో వరుణ్ కీలక పాత్ర పోషించారు. అందులో ఉన్న హానికర రసాయనాల గురించి పరిశోధనాత్మకంగా, సాక్ష్యాధారాలతో మీడియా ముందు పెట్టారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇక చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేసే విమర్శలకు ధీటుగా బదిలిస్తూ, వారిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
గతంలో నిరుద్యోగ సమస్య, డ్రగ్స్, స్థానిక సమస్యలపై పోరాటం చేసి పలుమార్లు అరెస్ట్ అయ్యారు. తాజా ఎన్నికల ప్రచారంలో వరుణ్ ప్రసంగాలు వింటే, పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణగల కార్యకర్తగా, వైసీపీ అప్రజాస్వామిక విధానలపై తను ఎత్తిచూపుతున్న అంశాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.
Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ
చిత్తూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎర్ర చందనం డాన్ విజయానంద రెడ్డిపై వరుణ్ చేస్తున్న విమర్శలు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక పక్క టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్(Gurajala Jaganmohan) ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోపక్క ఆయనకు బలమైన వ్యక్తిగా వరుణ్ పని చేస్తున్నారు. తన వాగ్దాటితో ప్రత్యర్థి పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి విజయనంద రెడ్డికి కొరకరాని కొయ్యగా వరుణ్ మారారు.
విజయానంద రెడ్డి(Vijayananda reddy) నామినేషన్ వేసిన అరగంటకే మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ నిప్పులు చెరిగిన విషయం స్థానికంగానూ సంచలనం సృష్టించింది. విజయానందరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన 15 కేసుల గురించి చెబుతూ.. స్మగ్లర్‌ను చిత్తూరు ప్రజలు నమ్మరని, మహామహులు పుట్టిన చిత్తూరు ప్రాంతానికి ఓ స్మగ్లర్‌ను అసెంబ్లీకి పంపించే గతి పట్టలేదని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..
అసలు విజయానంద రెడ్డి నాయకుడే కాదని, నాయకుడిగా వైసీపీ నాయకులు ప్రొజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కే చిత్తూరు ప్రజలు పట్టం కడతారని, ఇదే జరుగుతుందని వరుణ్ జోస్యం చెప్పారు.
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాట రాసిన శంకరంబాడి సుందరాచారి పుట్టిన గడ్డ, గురువులకే గురువు, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చదువు చెప్పిన ఊరు, విద్యావేత్త చిన్నంరెడ్డి ఎమ్మెల్యేగా సేవలందించిన నేలపై ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను, లిక్కర్, లాటరీ, బెట్టింగ్ వ్యవహారాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నీచమైన వ్యక్తికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీటిచ్చారని వ్యాఖ్యానించారు. విజయానంద రెడ్డిని ఎల్ఎల్‌బీ(లిక్కర్, లాటరీ, బెట్టింగ్) అని ముద్దుగా స్థానికులు పిలుచుకుంటారన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాకు సంబంధించి 15 కేసులు ఆయనపై ఉన్నాయన్నారు.
కేసుల్లో చిక్కుకుని.. పోలీసులకు పట్టుబడకుండా 20 రోజుల పాటు ఒక విమానం నుంచి ఇంకో విమానం మారుతూ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల వనసంపదను దోచుకున్న వ్యక్తి విజయానంద రెడ్డి అని మండిపడ్డారు.
చోటామోటా స్మగ్లర్లకు లీడర్ లాంటి విజయానంద రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు, పీలేరు జైలులో శిక్ష అనుభవించాడన్నారు. జైలులో వీఐపీ ట్రీట్మెంట్ కూడా పొందారని విమర్శించారు. ఇలాంటి స్మగ్లర్‌నా మనం అసెంబ్లీకి పంపిచాల్సి వస్తోందని చిత్తూరు వాసులు తలపట్టుకుంటున్నారని వరుణ్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఈ మాటలే చిత్తూరు నియోజకవర్గ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా జనం మాటల్లో ఇవే వినిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసేలా.. చిత్తూరు రాజకీయాన్ని మార్చేలా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.
నియోజకవర్గ గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తికే ఓటేసేలా వరుణ్ ప్రెస్ మీట్ పలువురిని ఆలోచింప చేసిందని, నియోజకవర్గ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గురజాల జగన్మోహన్‌కి స్వతహాగా ఉన్న మంచితనం, ప్రజల్లో ఉన్న పలుకుబడి పార్టీ విజయానికి మరింత దోహదం చేస్తుండగా, ప్రత్యర్థులపై వరుణ్ మాటల దాడి దాన్ని రెట్టింపు చేస్తుందన్న విశ్వాసం స్థానికంగా టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.
Nellore: భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు.. ఎవరిదో జోరు!
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 22 , 2024 | 09:55 PM