Venigandla Ramu: గుడివాడలో పిట్టలదొర కబుర్లు చెప్పిన సీఎం జగన్
ABN, Publish Date - Apr 16 , 2024 | 04:29 PM
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. గుడివాడలో సీఎం జగన్ (CM JAGAN) ‘మేమంతా సిద్ధం’ సభలో అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారని సెటైర్లు వేశారు.
కృష్ణాజిల్లా (గుడివాడ): ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. గుడివాడలో సీఎం జగన్ (CM JAGAN) ‘మేమంతా సిద్ధం’ సభలో అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారని సెటైర్లు వేశారు. గుడివాడ రాజకీయాల్లో నిన్న జరిగిన సభ ప్రజలను కష్ట పెట్టే సభ అని చెప్పారు.
AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్
మూడు ఎకరాల స్థలంలో సీఎం సభా? నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడం తప్ప ఈ సభ ద్వారా ఏం చెప్పారని నిలదీశారు. జగన్ అబద్ధాలే చెప్పడని.. తాము ఒత్తిడి తెచ్చినా చెప్పడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సుకుమారంగా చెప్పారని దెప్పిపొడిచారు. జగన్, కొడాలి నాని 5 మాటలు చెబితే అందులో3 అబద్ధాలే ఉంటాయని ఎద్దేవా చేశారు. దుర్మార్గులైన తమ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు మంచి వారని, సౌమ్యులు అంటూ సభా వేదికపైనే సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు.
CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు
టిడ్కో ఇల్లు ఫ్రీ అని చెప్పిన సీఎం జగన్ దాని గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గుడివాడ, జిల్లా కోసం జగన్, కొడాలి నాని ఏం చేస్తారో చెప్పలేదన్నారు. ఒంటరిగా వస్తున్నానని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడు.. కానీ కన్నతల్లిని వదిలేస్తే ఆమె విదేశాలకు వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ఆయన చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడన్నారు. ఇలాంటి వ్యక్తి దేశాన్ని ఉద్ధరిస్తాడా అని నిలదీశారు. గుడివాడలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఈ లాంటివేం జగన్‌కు పట్టవన్నారు.
ఒకరినొకరు పొగుడుకోవడానికే సభా సమయం అంతా సరిపోయిందన్నారు. సభా సాక్షిగా జగన్ ఒక నిజం చెప్పారని 5 ఏళ్లుగా కొడాలి నాని ఏం పని చేయలేక పోయారన్నారు. ఇంకో అవకాశం ఇవ్వండి అన్ని చేయించే బాధ్యత తనదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తానని కొడాలి నాని చెబుతున్నాడని.. ఆ విషయం సీఎంతో చెప్పించాలి కదా అని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ ఢీకొని వృద్ధురాలు గాయపడిన కనీసం పట్టించు కోకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత సీఎంఓ నుంచి కదలిక వచ్చిందని వెనిగండ్ల రాము అన్నారు.
YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 16 , 2024 | 04:36 PM