Elections 2024: ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే జైలే..!
ABN, Publish Date - May 10 , 2024 | 02:09 PM
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఓటరు కాకపోతే పోలింగ్ బూత్‌లోకి ప్రవేశం ఉండదు. పోలింగ్ బూత్ సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తారు. ఎవరైనా గుంపులు గుంపులుగా వెళ్లినా.. న్యాసెన్స్ క్రియుట్ చేసినా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. పోలింగ్ బూత్ సమీపంలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. ఓటరు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని ఓటు వేయడానికి వెళ్లాల్సి ఉంటుంది. వేరే వాళ్ల ఓటు మరొకరు వేయడానికి ప్రయత్నించినా వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలింగ్ బూత్‌లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, కెమెరా తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఎన్నికల అధికారుల విధులకు ఓటరు ఆటంకం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. మద్యం తాగి ఓటు వేయడానికి వెళ్లినా.. పోలింగ్ బూత్‌లో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. మద్యం తాగి పోలింగ్ బూత్ సమీపంలో న్యూసెన్స్ క్రియేట్ చేసినా చర్యలు తీసుకుంటారు.
CPM(GS) Sitaram Yechury:ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు!
ఓటరు ఇలా చేస్తే నేరం..
ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లినా.. స్విచ్ఛాప్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓటు వేసేటప్పుడు మొబైల్‌లో లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాల్లో షూట్ చేయకూడదు. ఓటును బహిరంగపర్చడం చట్టరీత్యా నేరం కావడంతో ఓటరు తాను ఓటు వేసేటప్పుడు.. దేనికి వేశారనే విషయాన్ని బహిరంగ పర్చేలా ఏపనిచేసినా నేరమే అవుతుంది. ఎవరైనా ఓటరు ఓటు వేసేటప్పుడు దానిని ఫోటో లేదా వీడియో తీస్తే ఆ ఓటరును పోలీసులు అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఓటరు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వెంటనే పోలింగ్ బూత్‌ను వదిలి బయటకు వచ్చేయాలి. ఉద్దేశపూర్వకంగా ఎక్కువ సేపు అక్కడే నిల్చుని.. ఇతరులు ఓటు వేయకుండా ఆటంకం కలిగించినా చర్యలు తీసుకుంటారు. ఓటుకు నోటు తీసుకోవడం నేరం. ఎవరైనా డబ్బులు తీసుకుని ఓటు వేశారని రుజువైతే వారిపై చర్యలు తీసుకుంటారు.
దొంగ ఓటు వేస్తే..
ఓటరు లిస్ట్‌లో ఎవరి పేరుందో ఆ వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి. ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తి బదులు వేరు వ్యక్తి ఓటు వేస్తే అతడిపై కేసు నమోదు చేస్తారు. దొంగ ఓట్లు వేయడం చట్టరీత్యా నేరం. అలాగే ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఒక వ్యక్తి దేశంలో ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ.. కేవలం ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. రెండూ చోట్ల ఓటు వేస్తే ఆవ్యక్తిపై చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించి ఓటు వేస్తే ఎలాంటి చిక్కులు ఉండవు. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి.
AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 02:20 PM