AP Elections: కాపులంతా ఫిక్స్.. కలిసొచ్చేది ఎవరికి..?
ABN, Publish Date - May 02 , 2024 | 11:35 AM
ఏపీ ఎన్నికల్లో రాజకీయమంతా కాపుల చుట్టూ తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో కాపుల్లో ఎక్కువమంది వైసీపీకి ఓట్లు వేసినట్లు గత ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అదేసమయంలో కాపుల ఓట్లు 3పార్టీలకు చీలిపోవడంతోనూ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా కాపు సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీ ఎన్నికల్లో రాజకీయమంతా కాపుల చుట్టూ తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో కాపుల్లో ఎక్కువమంది వైసీపీకి ఓట్లు వేసినట్లు గత ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అదేసమయంలో కాపుల ఓట్లు 3పార్టీలకు చీలిపోవడంతోనూ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా కాపు సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటివరకు కాపుల్లో ఐక్యత లేదనే ప్రచారం ఆ సామాజికి వర్గానికి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సామాజికవర్గం ఓట్లు ఎవరికి పడతాయనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.
కాపు సామాజిక వర్గంలో పెద్దలుగా చెప్పుకునే ఒకరిద్దరిని తమవైపు తిప్పుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించవచ్చనే వైసీపీ ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంతో పవన్‌కళ్యాణ్‌ను తిట్టించి.. పార్టీలో చేర్చుకోవడం ద్వారా పద్మనాభంపై కాపులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ద్వారా కాపులంతా పవన్‌కళ్యాణ్‌కే మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాపులు వైసీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా తమ సామాజికవర్గానికి కలిసొచ్చేది ఏమి లేదని, రాజకీయంగా తాము ఉనికిని కోల్పోయే ప్రమాదముందనే విషయాన్ని కాపు నేతలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు జనసేనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కాపులు జనసేనకు మద్దతిచ్చి.. ఎక్కువ సీట్లు గెలిపిస్తే.. తమ సామాజిక వర్గానికి రాజకీయ పలుకుబడి మరింతగా పెరుగుతుందనే ఆలోచనలో కాపులు ఉన్నట్లు తెలుస్తోంది.
నవ సందేహాలకు జగన్ జవాబివ్వాలి
జనసేన వైపే..!
కాపుల్లో ఎక్కువమంది జనసేన భాగస్వామిగా ఉన్న ఎన్డీయే కూటమికే మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో జనసేనకు ఇచ్చిన సీట్ల సంఖ్యపై అసంతృప్తిగా ఉన్న కాపు నేతలను బుజ్జగించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. ప్రస్తుతం పోటీచేస్తున్న స్థానాల్లో అధికశాతం గెలిస్తే.. పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడం ద్వారా కాపులకు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందనే ఉద్దేశంతోనే 21 సీట్లకు అంగీకరించానని, తన నిర్ణయాన్ని కాపులంతా అర్థంచేసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి ఆ సామాజిక వర్గం నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో జనసేనకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వాలని కాపు సంఘాల నేతలు డిసైడ్ అయినట్లు తెలస్తోంది. జనసేన పోటీచేస్తున్న స్థానాలతో పాటు.. ఎన్డీయే కూటమిలోని టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు కాపులు ముందుకువచ్చినట్లు తెలుస్తోంది.
అంతా ఐక్యంగా..
గత ఎన్నికల్లో కాపుల ఓట్లు చీలిపోవడం ద్వారా వైసీపీకి లాభం జరిగింది. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని కాపు నేతలు ఓ నిర్ణయానికి వచ్చారట. వైసీపీ నుంచి కాపు నేతలు పోటీచేస్తున్న చోట్ల కూడా కూటమికే మద్దతు తెలపాలనే ఆలోచనతో కాపులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపేందుకు కాపు ఓటర్లు ముందుకు వచ్చినట్లు సమాచారం. కాపులంతా ఏకపక్షంగా కూటమికి మద్దతు పలుకారా లేదా.. వైసీపీ వైపు మొగ్గు చూపారా అనేది జూన్4న తెలియనుంది.
అది.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Latest AP News and Telugu News
Updated Date - May 02 , 2024 | 11:35 AM