YSRCP: వాలంటీర్ల రాజీనామాలు అంతా వైసీపీ కుట్రలో భాగమేనా?
ABN, Publish Date - Apr 03 , 2024 | 11:05 AM
Andhrapradesh: ఏపీలో పింఛన్‌దారులకు నగదు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూకేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టేయడంతో వారితో రాజీనామాలు చేయించాలనే కొత్త నాటకానికి వైసీపీ తెర తీసింది. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి.
నెల్లూరు, ఏప్రిల్ 3: ఏపీలో పింఛన్‌దారులకు నగదు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వైసీపీ (YSRCP) తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్లను (AP Voluteers) విధుల నుంచి పక్కన పెట్టేయడంతో వారితో రాజీనామాలు చేయించాలనే కొత్త నాటకానికి వైసీపీ తెర తీసింది. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి. అయితే వాలంటీర్లు తమ ఇష్టపూర్వకంగా కాకుండా.. వైసీపీ నేతల ఒత్తిళ్ల మేరకే రాజీనామాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
Kejriwal : ఒక్కసారిగా 4.5 కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. టెన్షన్‌లో ఆప్!
సోషల్ మీడియాలో వైసీపీ నేత వాయిస్ మెసేజ్
జిల్లాలోని కావలి నియోజకవర్గంలో రాజీనామాలు చేయాలంటూ వాలంటీర్లను వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారు. వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ వాయిస్ మెసేజ్‌తో ఆ పార్టీ చేసిన భారీ కుట్రలు బయటపడ్డాయి. తమని విధుల నుంచి పక్కన పెట్టించారు కాబట్టే రాజీనామాలు చేసినట్లు వాలంటీర్లు చెప్పాలంటూ తీవ్ర వత్తిళ్లుకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కోసం బయటకొచ్చినట్టు పత్రికల వారికి చెప్పాలంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం వైసీపీ నేత నారాయణ వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పార్టీ నేతల తీరుపై ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 600 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. మచిలీపట్నంలో ఒక్కసారే 430 మంది రాజీనామా చేయగా.. ఇటు కర్నూలులో 92 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
AP Pensions: ఇంకా ప్రారంభం కాని పెన్షన్ల పంపిణీ.. ప్రజల ఆగ్రహం
Ramdas: తేల్చి చెప్పేశారు.. భవిష్యత్తులో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోం..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 03 , 2024 | 11:48 AM